Telugu Global
Cinema & Entertainment

సాహో" లో శ్రద్ధ కపూర్ వాయిస్ కు డబ్బింగ్ చెప్పేదెవరు ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చేస్తున్న సినిమా “సాహో”. “రన్ రాజా రన్” ఫేం సుజీత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డైరెక్ట్ చేస్తుండగా, యువి క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే […]

సాహో లో శ్రద్ధ కపూర్ వాయిస్ కు డబ్బింగ్ చెప్పేదెవరు ?
X

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చేస్తున్న సినిమా “సాహో”. “రన్ రాజా రన్” ఫేం సుజీత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డైరెక్ట్ చేస్తుండగా, యువి క్రియేషన్స్ వాళ్ళు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే షూటింగ్ తరువాత టీం మొత్తం డబ్బింగ్ పనులను మొదలు పెట్టబోతున్నారు. ఈ సమయం లో శ్రద్దా దర్శకుడితో తన‌ వాయిస్ కి తనే తెలుగు లో డబ్బింగ్ చెబుతాను అని చెప్పిందట. శ్రద్ధ కపూర్ ఇప్పటి వరకు తెలుగు లో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు, అసలు తెలుగు బాష మీద శ్రద్ధ కి ఎలాంటి అవగాహనా లేదు. మరి శ్రద్ధ కపూర్ అసలు ఎలా డబ్బింగ్ చెప్పుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ధియేటర్స్ లో సందడి చేయనుంది.

First Published:  18 Sep 2018 8:38 PM GMT
Next Story