Telugu Global
NEWS

పీసీసీ క‌మిటీల‌పై పెద‌వి విరుపులు !

ఈ మాత్రం క‌మిటీల‌కు ఇంత బిల్డ‌ప్ అవ‌స‌ర‌మా ! ముఖ్య‌మైన నేత‌ల‌కు సంతృప్తి ప‌రిచేందుకు ఒక్కో క‌మిటీకి ఒక్కో నేత‌ను ఛైర్మ‌న్ చేశారు. పార్టీలో ఉన్న లీడర్లందరినీ పదవులతో నింపేసింది. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ తో సరిపెట్టింది. అయితే రేవంత్ ప‌ద‌విపై అప్పుడే కామెంట్లు మొద‌ల‌య్యాయి. ప్ర‌చార క‌మిటీ ప‌ద‌విని కోరుకుంటే… ఆయ‌న‌కు ఇష్టం లేని ప‌ద‌వి ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రీ ఆయ‌న ఆ ప‌ద‌వి తీసుకుంటారో లేదో చూడాలి. మరోవైపు భట్టీ […]

పీసీసీ క‌మిటీల‌పై పెద‌వి విరుపులు !
X

ఈ మాత్రం క‌మిటీల‌కు ఇంత బిల్డ‌ప్ అవ‌స‌ర‌మా ! ముఖ్య‌మైన నేత‌ల‌కు సంతృప్తి ప‌రిచేందుకు ఒక్కో క‌మిటీకి ఒక్కో నేత‌ను ఛైర్మ‌న్ చేశారు. పార్టీలో ఉన్న లీడర్లందరినీ పదవులతో నింపేసింది. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ తో సరిపెట్టింది. అయితే రేవంత్ ప‌ద‌విపై అప్పుడే కామెంట్లు మొద‌ల‌య్యాయి. ప్ర‌చార క‌మిటీ ప‌ద‌విని కోరుకుంటే… ఆయ‌న‌కు ఇష్టం లేని ప‌ద‌వి ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రీ ఆయ‌న ఆ ప‌ద‌వి తీసుకుంటారో లేదో చూడాలి.

మరోవైపు భట్టీ విక్రమార్కకు ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు ఇచ్చారు. వాస్తవానికి భట్టీ బలం అది కాదు. ఆయన నాలుగు గోడల మధ్య కూర్చొని మేథోమథనం చేయగలరు. కానీ, ప్రజలను ఉర్రూతలూగించి… పార్టీకి జోష్ తేలేరు. ఇక మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి పార్టీ మారి వారం అయినా ఆయనకు మూడు కమిటీలలో స్థానం కల్పించారు. ప‌బ్లిసిటీ క‌మిటీ, స్ట్రాట‌జీ,ప్ర‌చార క‌మిటీ మ‌ధ్య తేడా ఏంటో కాంగ్రెస్ నేత‌ల‌కే తెల‌వాలి.

ఓ క‌మిటీకి విహెచ్‌ను, మ‌రో క‌మిటీ కోమ‌టిరెడ్డిని ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. ఈ రెండు క‌మిటీలు ఏం చేస్తాయో తెలియ‌దు. ఈ క‌మిటీల‌పై డీకే అరుణ అప్పుడే మాట్లాడ‌టం మొద‌లెట్టారు. ఈ కమిటీల్లో ప‌నిచేసేది లేద‌ని చెప్పుకొచ్చారు. ఈ క‌మిటీల నియామ‌కం వెనుక పెద్ద త‌తంగ‌మే జ‌రిగింద‌ని తెలుస్తోంది. భ‌ట్టివిక్ర‌మార్క‌, ఉత్త‌మ్ వ‌ర్గాలు క‌లిసిపోయాయ‌ని అంటున్నారు. కుంతియా, కొప్పుల రాజు మార్గ‌ద‌ర్శ‌కంలో ఈ రెండువ‌ర్గాలు క‌లిసి రేవంత్‌కు ప‌ద‌వి రాకుండా అడ్డుకున్నార‌ని గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

మొత్తం మీద టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీలు మొక్కుబడి వ్యవహారం కోసమే తప్ప… కురుక్షేత్ర సంగ్రామం కోసం కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

First Published:  19 Sep 2018 12:30 PM GMT
Next Story