Telugu Global
Cinema & Entertainment

శైలజారెడ్డి అల్లుడు మొదటి వారం వసూళ్లు

మొత్తానికి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు శైలజారెడ్డి అల్లుడు. విడుదలైన మొదటి రోజు వచ్చిన నెగెటివ్ టాక్ సినిమాను ఎక్కడ దెబ్బకొడుతుందేమో అని అంతా భయపడ్డారు. కానీ థియేటర్లలో ఉన్న గ్యాప్, వినాయక చవితి పండగ ఎఫెక్ట్ శైలజారెడ్డి అల్లుడ్ని సేఫ్ జోన్ లో పడేసింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఫస్ట్ వీక్ గడిచేసరికి దాదాపు 80శాతం రికవరీ చేసేసేంది. మరో 20శాతం రికవరీ చేస్తే, బ్రేక్ ఈవెన్ సాధించేసినట్టే. అలా […]

శైలజారెడ్డి అల్లుడు మొదటి వారం వసూళ్లు
X

మొత్తానికి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు శైలజారెడ్డి అల్లుడు. విడుదలైన మొదటి రోజు వచ్చిన నెగెటివ్ టాక్ సినిమాను ఎక్కడ దెబ్బకొడుతుందేమో అని అంతా భయపడ్డారు. కానీ థియేటర్లలో ఉన్న గ్యాప్, వినాయక చవితి పండగ ఎఫెక్ట్ శైలజారెడ్డి అల్లుడ్ని సేఫ్ జోన్ లో పడేసింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఫస్ట్ వీక్ గడిచేసరికి దాదాపు 80శాతం రికవరీ చేసేసేంది. మరో 20శాతం రికవరీ చేస్తే, బ్రేక్ ఈవెన్ సాధించేసినట్టే.

అలా అని శైలజారెడ్డి అల్లుడిది నల్లేరుమీద నడక కానే కాదు. ఈ వారం 5 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో సామి, నన్ను దోచుకుందువటే సినిమాలపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. పోనీ ఈ వారం ఎలాగోలా బండి లాగించేసినా, వచ్చే వారం దేవదాస్ సినిమా ఉంది. సో.. తండ్రి సినిమా వచ్చేలోగా నాగచైతన్య బ్రేక్ ఈవెన్ సాధించాలి. లేదంటే శైలజారెడ్డి అల్లుడికి నష్టాలు తప్పవు. ఇక ఈ వారం రోజుల రన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 6.04 కోట్లు
సీడెడ్ – రూ. 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.37 కోట్లు
ఈస్ట్ – రూ. 1.44 కోట్లు
వెస్ట్ – రూ. 0.91 కోట్లు
గుంటూరు – రూ. 1.46 కోట్లు
కృష్ణా – రూ. 0.93 కోట్లు
నెల్లూరు – రూ. 0.56 కోట్లు

First Published:  20 Sep 2018 5:42 AM GMT
Next Story