Telugu Global
National

కుమార్తెతో నటుడి వివాదం

సీనియర్ నటుడు విజయకుమార్ తన కుమార్తె వనితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె తన ఇంటిని ఆక్రమించిందంటూ పోలీసులను ఆశ్రయించారు. విజయకుమార్‌కు చెన్నైలోని అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మీనగర్లో ఇల్లు ఉంది. కొంతకాలంగా ఇంటిని షూటింగ్‌ల కోసం విజయకుమార్ అద్దెకు ఇస్తున్నారు. తన కుమారుడుతో కలిసి కొట్టివాక్కమ్‌లోని మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం విజయకుమార్ నుంచి కుమార్తె వనిత సినిమా షూటింగ్ కోసం ఇంటిని అద్దెకు తీసుకున్నారు. షూటింగ్  ముగిసిన తర్వాత కూడా ఆమె […]

కుమార్తెతో నటుడి వివాదం
X

సీనియర్ నటుడు విజయకుమార్ తన కుమార్తె వనితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె తన ఇంటిని ఆక్రమించిందంటూ పోలీసులను ఆశ్రయించారు. విజయకుమార్‌కు చెన్నైలోని అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మీనగర్లో ఇల్లు ఉంది. కొంతకాలంగా ఇంటిని షూటింగ్‌ల కోసం విజయకుమార్ అద్దెకు ఇస్తున్నారు.

తన కుమారుడుతో కలిసి కొట్టివాక్కమ్‌లోని మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారం రోజుల క్రితం విజయకుమార్ నుంచి కుమార్తె వనిత సినిమా షూటింగ్ కోసం ఇంటిని అద్దెకు తీసుకున్నారు. షూటింగ్ ముగిసిన తర్వాత కూడా ఆమె ఇంటిని ఖాళీ చేయడం లేదని విజయకుమార్‌ చెబుతున్నారు. ఖాళీ చేయాల్సిందిగా అడిగేందుకు వెళ్తే రౌడీలతో బెదిరించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విజయకుమార్‌ ఇంటికి వెళ్లి వనితను విచారించారు. తాను ఇంటిని ఖాళీ చేసే ప్రసక్తే లేదని… ఇంటిలో తనకు కూడా వాటా ఉందని ఆమె వాదించారు. ఇల్లు మీది అనడానికి ఆధారాలు చూపాలని పోలీసులు కోరగా వారితో వనిత గొడవపెట్టుకున్నారు. ఇంతలో మీడియా రావడంతో మీడియాప్రతినిధులపైనా వనిత రుసరుసలాడారు. మీడియా ప్రతినిధుల నుంచి కెమెరాలు లాక్కుని నేలకేసి కొట్టారు.

First Published:  21 Sep 2018 12:31 AM GMT
Next Story