అడిడాస్ ప్రచారకర్తగా హిమ దాస్

  • అసోం ఎక్స్ ప్రెస్ హిమ దాస్ సరికొత్త చరిత్ర
  • దశ తిరిగిన అసోం ఎక్స్ ప్రెస్ హిమ దాస్
  • 400 మీటర్ల పరుగులో భారత సంచలనం హిమ దాస్

అసోం ఎక్స్ ప్రెస్, భారత స్టార్ రన్నర్ హిమ దాస్… చరిత్ర సృష్టించింది. జకార్తా ఆసియాక్రీడల 400 మీటర్ల పరుగు, రిలే అంశాలలో ఓ స్వర్ణ, రెండు రజత పతకాలు సాధించడంతోనే.. హిమ దాస్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

కాలికి బూట్లు లేకుండా పరుగుతో తన క్రీడాజీవితాన్ని ప్రారంభించిన హిమ దాస్… ఏకంగా అడిడాస్ షూ కంపెనీకే ప్రచారకర్తగా ఎదిగింది. జర్మనీకి చెందిన విశ్వవిఖ్యాత క్రీడాఉత్పత్తుల సంస్థ అడిడాస్ తయారు చేసే ప్రత్యేక బూట్ల ను హిమ దాస్ పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.

అసోం లోని ధిండ్ ప్రాంతానికి చెందిన ఓ నిరుపేద రైతు కుటుంబంలో జన్మించిన హిమదాస్ ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్-20 విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఆసియాక్రీడల్లో మూడు పతకాలు సాధించడం ద్వారా…. అర్జున అవార్డుకు సైతం ఎంపికయ్యింది.