ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారిగా ఆమెను నియమించింది.

వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఉన్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. చురుకైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు.

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్న ఈసీ ఇందులో భాగంగా ఆమ్రపాలిని తెలంగాణ జాయింట్ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారిగా నియమించారు.