రాజమౌళి సినిమాకి బుర్రా మాటలు

ఎస్.ఎస్ రాజమౌళి “బాహుబలి” రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా… ఇప్పటి వరకు తన తదుపరి సినిమాని ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ తో తన తదుపరి సినిమా ఉండబోతుంది అని అధికారికంగా ప్రకటించాడు రాజమౌళి.

అయితే తన మాటల పదనుతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకొని క్రేజీ ప్రాజెక్ట్ లకు మాటల రచయితగా పనిచేస్తున్న బుర్రా సాయి మాధవ్ ను రాజమౌళి తన తదుపరి సినిమా కోసం తీసుకున్నాడ‌ట. ఇప్పటికే “సైరా” “ఎన్టీఆర్” వంటి సినిమాలతో పాటు ఇతర కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ రాజమౌళి ఆఫర్ ను స్వీకరించాడట సాయి మాధవ్ బుర్రా.

ఎందుకంటే “బాహుబలి” సినిమాకు బుర్రా మాటల రచయితగా పని చేయాల్సి ఉన్నా వేరే సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా “బాహుబలి”ని మిస్ చేసుకున్నాడు అని అప్పట్లో అందరూ అన్నారు. అందుకే ఈసారి రాజమౌళి కూడా మిస్ చేయకుండా బుర్రాను ఏరికోరి తీసుకున్నాడట. రాజమౌళి త్వరలో కథకు తుది మెరుగులు దిద్ది మాటల పనిని సాయి మాధవ్ బుర్రా గారికి అప్పజేబుతాడు. డి.వి.వి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయనున్నాడు.