Telugu Global
NEWS

బాబుకు చుక్కెదురు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చుక్కెదురైంది. బాబ్లీ కేసు విషయంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు ఝలక్‌ ఇచ్చింది. తనపై వచ్చిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై కోర్టుకు హాజరుకాని చంద్రబాబు నాయుడు.. తన తరపున న్యాయవాదులను పంపించారు. న్యాయవాదులు చంద్రబాబు తరపున రీకాల్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. చంద్రబాబుతో సహా మొత్తం 19 మందికి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లను జారీ చేయగా… తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, కేఎస్‌ రత్నం, ప్రకాశ్ గౌడ్ […]

బాబుకు చుక్కెదురు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చుక్కెదురైంది. బాబ్లీ కేసు విషయంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు ఝలక్‌ ఇచ్చింది. తనపై వచ్చిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై కోర్టుకు హాజరుకాని చంద్రబాబు నాయుడు.. తన తరపున న్యాయవాదులను పంపించారు.

న్యాయవాదులు చంద్రబాబు తరపున రీకాల్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. చంద్రబాబుతో సహా మొత్తం 19 మందికి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్లను జారీ చేయగా… తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, కేఎస్‌ రత్నం, ప్రకాశ్ గౌడ్ హాజరయ్యారు.

వారికి కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. హాజరు నుంచి చంద్రబాబుకు మినహాయింపు ఇవ్వాలని న్యాయవాదులు కోరగా కోర్టు అంగీకరించలేదు. రీకాల్ పిటిషన్‌ను తిరస్కరించింది. తాము అందరికి సమన్యాయం పాటిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

చంద్రబాబు కోర్టుకు రావాల్సిందేనని ఆదేశించింది. అందుకు కనీసం నాలుగువారాల గడువు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అందుకు కూడా కోర్టు అంగీకరించలేదు. అక్టోబర్‌ 15కు కేసు వాయిదా వేసింది. చంద్రబాబుతో పాటు మిగిలిన 15 మంది ఆ రోజు కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.

First Published:  21 Sep 2018 3:12 AM GMT
Next Story