అయోమయం లో “సై రా” టీం

“సై రా నరసింహారెడ్డి”….ఈ సినిమా టిజర్ నెట్ లో వచ్చినప్పటి నుంచి ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సినిమా కోసం నిర్విరామంగా నటిస్తున్న చిరంజీవి ఇటీవలే భుజానికి సర్జరీ చేయించుకున్నాడట. సర్జరీ చేయించుకున్న కారణంగా రోజువారీగా చేసే ఎక్సర్ సైజులకు తాత్కాలికంగా విరామం ఇచ్చాడు చిరంజీవి. దాంతో చిరు బరువు పెరిగాడట. ఇప్పుడు ఈ బరువు పెరగటమే నరసింహారెడ్డి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కి ఇబ్బంది గా మారిందట.

అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో మెగాస్టార్ కు లుక్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న కారణంతో వాటిని ఎలా మేనేజ్ చేయాలనీ సినిమా టీమ్ తర్జనభర్జన అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో “బాహుబలి” లో అనుష్కకు కొన్ని సన్నివేశాలలో సహజత్వం కోసం ఉపయోగించిన టెక్నాలజీనే” సైరా”కు వాడదాం అని యూనిట్ అనుకుంటున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి ఈ వయసు లో హెవీ వర్క్ అవుట్స్ అస్సలు చెయ్యడానికి వీలు లేదు అందుకే రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కలిసి ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.