దమ్ముంటే నాలుక కోయ్‌…. పోలీస్ సంఘం నేతకు జేసీ సవాల్

ప్రబోధానంద స్వామి డేరా బాబాతో సమానమని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రబోధానంద ఆశ్రమాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. తాడిప్రతి ఘర్షణ సమయంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదన్నారు.

జేసీ దివాకర్ రెడ్డి నాలుక కోస్తామన్న పోలీస్ అధికారుల సంఘం కార్యదర్శి మాధవ్‌పైనా జేసీ ఫైర్ అయ్యారు. దమ్ముంటే నా నాలుక కోయి చూద్దాం అంటూ సవాల్ చేశారు. నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా .. చూసుకుందాం అంటూ మాధవ్‌పై జేసీ విరుచుకుపడ్డారు.

ఈనెల 25లోపు ఎప్పుడైనా తాడోపేడో తేల్చుకుందామని డెడ్‌లైన్‌ కూడా పెట్టారు జేసీ. మాధవ్‌ అంతు తేలుస్తానని జేసీ హెచ్చరించారు. మరోవైపు ఒక పోలీస్ అధికారి అయి ఉండి మీసం తిప్పి నాలుక కోస్తామని చట్టవిరుద్దంగా మాధవ్ చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వస్తున్నాయి.