Telugu Global
Cinema & Entertainment

నిజాలు ఒప్పుకున్న నాగార్జున

దేవదాస్ ఆడియో రిలీజ్ సందర్భంగా తన కుటుంబానికి చెందిన 2 సినిమాలపై ఓపెన్ గా మాట్లాడాడు నాగార్జున. అందులో ఒకటి సమంత నటించిన యూటర్న్ అయితే, రెండోది నాగచైతన్య చేసిన శైలజారెడ్డి అల్లుడు. ఈ రెండు సినిమాలపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశాడు నాగ్. శైలజారెడ్డి అల్లుడు సినిమాకు మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ విషయాన్ని నాగార్జున అంగీకరించాడు. సమంత తనకు కొన్ని రివ్యూస్ చూపించిందని, సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందని చెప్పి బాధపడిందని నాగ్ […]

నిజాలు ఒప్పుకున్న నాగార్జున
X

దేవదాస్ ఆడియో రిలీజ్ సందర్భంగా తన కుటుంబానికి చెందిన 2 సినిమాలపై ఓపెన్ గా మాట్లాడాడు నాగార్జున. అందులో ఒకటి సమంత నటించిన యూటర్న్ అయితే, రెండోది నాగచైతన్య చేసిన శైలజారెడ్డి అల్లుడు. ఈ రెండు సినిమాలపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడేశాడు నాగ్.

శైలజారెడ్డి అల్లుడు సినిమాకు మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ విషయాన్ని నాగార్జున అంగీకరించాడు. సమంత తనకు కొన్ని రివ్యూస్ చూపించిందని, సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందని చెప్పి బాధపడిందని నాగ్ అన్నాడు. అయితే కంగారు పడొద్దని, సాయంత్రానికి అంతా సెట్ అవుతుందని తను సమంతకు చెప్పానని, చెప్పినట్టుగానే శైలజారెడ్డి అల్లుడు ఊపందుకుందని అన్నాడు.

ఇక సమంత నటించిన యూటర్న్ గురించి మాట్లాడుతూ, ఆ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం రాలేదని ఒప్పుకున్నాడు. అయితే ఆదివారం నాటికి వసూళ్లు బాగుంటాయని సమంతకు ధైర్యం చెప్పానని, చెప్పినట్టుగానే ఆదివారానికి యూటర్న్ కోలుకుందని అన్నాడు నాగ్.

నాగ్ చెప్పిన నిజాలు బాగానే ఉన్నాయి కానీ ఆదివారానికి యూటర్న్ కోలుకుందని, సాయంత్రానికి శైలజారెడ్డి అల్లుడు సెట్ అయిపోయిందని నాగ్ చెప్పడం మాత్రం కాస్త ఓవర్ గా ఉంది. ఇప్పటికీ యూటర్న్ కు కలెక్షన్లు లేవు. శైలజారెడ్డి అల్లుడికి హిట్ టాక్ రాలేదు. రెండూ అలా నడుస్తున్నాయంతే.

First Published:  21 Sep 2018 8:00 AM GMT
Next Story