తమన్ వాళ్ళ అమ్మని ఏడ్పించిన పాట

ఇటివలే “అరవింద సమేత” సినిమా నుంచి పెనివిటి అనే సాంగ్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్. రిలీజ్ అయిన రోజు నుంచే ఈ లిరికల్ వీడియో సాంగ్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ఈ పాట విని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మదర్ కూడా ఎమోషనల్ అయ్యారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎస్.ఎస్ తమన్ ఓ ట్వీట్ కూడా చేసాడు.

“అమ్మ నన్ను సడె‌న్‌గా తన రూముకు రమ్మని పిలిచి హగ్ చేసుకున్నారు. ఆమె ముఖంలో ఆనంద భాష్పాలతో నా షర్టు తడిచిపోయింది. ఈ పాట విన్న తర్వాత ఆమె చాలా ఆనంద పడ్డారు” అని తమన్ చెప్పాడు. తమన్ సంగీతం అందించిన ఈ పాట ఇప్పుడు అందరి ఫేవరెట్ గా మారిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. పూర్తీ స్థాయి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ గా ఉండబోతుంది అని ఈ పాట వింటే అర్ధం అవుతుంది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.