Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కంటే ముందే వస్తున్న దేవరకొండ

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నోటా. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 5న నోటాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ పేజీలో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిన నోటా సినిమా ఒకేసారి రెండు భాషల్లో విడుదలకాబోతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ లో కూడా లక్ చెక్ చేసుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో తెలుగులో […]

ఎన్టీఆర్ కంటే ముందే వస్తున్న దేవరకొండ
X
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నోటా. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 5న నోటాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ మేరకు విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ పేజీలో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిన నోటా సినిమా ఒకేసారి రెండు భాషల్లో విడుదలకాబోతోంది.
ఈ సినిమాలో కోలీవుడ్ లో కూడా లక్ చెక్ చేసుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలతో తెలుగులో ఇప్పటికే మార్కెట్ సెట్ చేసుకున్న ఈ హీరో, ఇప్పుడు నోటాతో తమిళ ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తాననే నమ్మకంతో ఉన్నాడు.
ఆనంద్ శంకర్ డైరక్ట్ చేసిన నోటా సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. స్టుడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు. మరో వారం రోజుల్లో నోటా పాటలు మార్కెట్లోకి నేరుగా విడుదలకాబోతున్నాయి.
First Published:  22 Sep 2018 11:12 AM GMT
Next Story