అరవింద సమేత నుంచి ఐదో పాట

అరవింద సమేత జూక్ బాక్స్ విడుదలైంది. అందులో నాలుగు పాటలే కనిపించాయి. సాధారణంగా సినిమా అంటే 6 పాటలుంటాయి. ట్రెండ్ మారిందనుకున్నప్పటికీ కనీస 5 పాటలుంటాయి. కానీ ఎన్టీఆర్ లాంటి హీరో నటిస్తున్న సినిమాలో కేవలం 4 పాటలే ఏంటనే అనుమానం అందరికీ కలిగింది. ఇప్పుడా అనుమానాలకు చెక్ పడింది.
ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో 5 పాటలున్నాయట. కావాలనే ఒక పాటను విడుదల చేయలేదట. రిలీజ్ కు కొన్ని రోజుల ముందు నిర్వహించే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఆ ఐదో పాటను అట్టహాసంగా విడుదల చేస్తారని తెలుస్తోంది.
ఇదే పద్ధతిని 2.0 సినిమాలో కూడా ఫాలో అయ్యారు. ఆ సినిమా ఆడియోను దుబాయ్ లో అంగరంగ వైభవంగా విడుదల చేశారు. కానీ అక్కడ కూడా ఒక పాటను కావాలనే ఆపారు. విడుదల సమయంలో ఆ పాటను ఫ్రెష్ గా రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అరవింద కూడా అదే ఫార్ములా ఫాలో అవుతోందన్నమాట.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక పాట మినహా టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన ఆ ఒక్క పాట కోసం యూనిట్ ఈరోజే ఇటలీ బయల్దేరింది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది అరవింద సమేత చిత్రం.