Telugu Global
National

కేక్ క‌ట్ చేసి వ‌చ్చినంత మాత్రాన మ‌న సైనికుల‌పై దాడులు ఆగ‌వు

జ‌మ్ములో అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద పాకిస్తానీ బ‌ల‌గాల చేతిలో హ‌త్య‌కు గురైన బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆప్ ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. కోటి రూపాయల ప‌రిహారం అందిస్తాన‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. హ‌ర్యానాలో సోనీప‌ట్ ప్రాంతంలో న‌రేంద్ర సింగ్ కుటుంబ స‌భ్యుల‌ను కేజ్రీవాల్ ప‌రామ‌ర్శించారు. హ‌ర్యానా ఆప్ చీఫ్ న‌వీన్ జైహింద్ కూడా కేజ్రీవాల్‌కు తోడుగా వ‌చ్చారు. క్యాబినెట్‌లో బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ న‌రేంద్ర సింగ్ అంశాన్ని చ‌ర్చించిన అనంత‌రం ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని […]

కేక్ క‌ట్ చేసి వ‌చ్చినంత మాత్రాన మ‌న సైనికుల‌పై దాడులు ఆగ‌వు
X

జ‌మ్ములో అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద పాకిస్తానీ బ‌ల‌గాల చేతిలో హ‌త్య‌కు గురైన బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆప్ ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. కోటి రూపాయల ప‌రిహారం అందిస్తాన‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. హ‌ర్యానాలో సోనీప‌ట్ ప్రాంతంలో న‌రేంద్ర సింగ్ కుటుంబ స‌భ్యుల‌ను కేజ్రీవాల్ ప‌రామ‌ర్శించారు. హ‌ర్యానా ఆప్ చీఫ్ న‌వీన్ జైహింద్ కూడా కేజ్రీవాల్‌కు తోడుగా వ‌చ్చారు.

క్యాబినెట్‌లో బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ న‌రేంద్ర సింగ్ అంశాన్ని చ‌ర్చించిన అనంత‌రం ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిల‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఢిల్లీ ప్ర‌భుత్వ అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చిన అనంత‌రం కేజ్రీవాల్…మోడీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ప్ర‌ధాని కాక ముందు న‌రేంద్ర మోడీ అనేక సార్లు పాకిస్థాన్ గురించి మాట్లాడేవార‌ని…ధీటైన జ‌వాబిస్తామ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికార‌ని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ప్ర‌స్తుతం పాకిస్తాన్‌కు ధీటైన స‌మాధానం చెప్పే స‌మ‌యం వ‌చ్చింద‌ని…ఇటువంటి స‌మ‌యంలో మౌనంగా కూర్చోవ‌డం స‌రికాద‌ని కేజ్రీవాల్ అన్నారు.

2015లో పాకిస్తాన్ వెళ్లి అప్ప‌టి ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌ని క‌లిసి.. కేక్ క‌ట్ చేసి వ‌చ్చినంత మాత్రాన మ‌న సైనికుల‌పై దాడులు ఆగ‌వ‌ని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని గ‌తంలో అనేక సార్లు చెప్పిన మోడీ…ఇప్పుడు ఆ ప‌ని చేయాల‌ని కేజ్రీవాల్ సూచించారు.

పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడ‌క‌పోయినంత మాత్రాన సైనికుల కిరాత‌క హత్య‌లు ఆగ‌వ‌ని కేజ్రీవాల్ అన్నారు. పాకిస్తాన్ మ‌రోసారి ఇటువంటి దాడుల‌కు పాల్ప‌డేందుకు భ‌య‌ప‌డేలా ధీటైన జ‌వాబివ్వాల‌ని కేజ్రీవాల్ మోడీని కోరారు.

First Published:  21 Sep 2018 11:55 PM GMT
Next Story