Telugu Global
International

442 రోజుల తర్వాత జడేజా జాదూ

బంగ్లాదేశ్ పై 29 పరుగులకే 4 వికెట్ల స్పిన్నర్  ఆసియాకప్ లో జడేజా స్పిన్ మ్యాజిక్ 442రోజుల సుదీర్ఘ విరామం తర్వాత…భారత వన్డే జట్టులో చోటు సంపాదించిన సౌరాష్ట్ర లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా సత్తా చాటుకొన్నాడు. ఆసియాకప్ సూపర్ ఫోర్… తొలిరౌండ్ పోటీలో బంగ్లాదేశ్ పై29 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 2014లో అప్ఘనిస్థాన్ పై 30 పరుగులకే 4 వికెట్లు సాధించిన తన రికార్డును తానే […]

442 రోజుల తర్వాత జడేజా జాదూ
X
  • బంగ్లాదేశ్ పై 29 పరుగులకే 4 వికెట్ల స్పిన్నర్
  • ఆసియాకప్ లో జడేజా స్పిన్ మ్యాజిక్

442రోజుల సుదీర్ఘ విరామం తర్వాత…భారత వన్డే జట్టులో చోటు సంపాదించిన సౌరాష్ట్ర లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా సత్తా చాటుకొన్నాడు.

ఆసియాకప్ సూపర్ ఫోర్… తొలిరౌండ్ పోటీలో బంగ్లాదేశ్ పై29 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

2014లో అప్ఘనిస్థాన్ పై 30 పరుగులకే 4 వికెట్లు సాధించిన తన రికార్డును తానే మెరుగు పరుచుకొన్నాడు. గత ఏడాది కాలంగా… సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు మాత్రమే పరిమితమైన జడేజాకు అక్షర్ పటేల్ గాయం వరంగా మారింది.
అక్షర్ పటేల్ స్థానంలో జట్టులో చేరిన జడేజా… తొలిమ్యాచ్ లోనే తానేమిటో నిరూపించుకొన్నాడు.

టీమిండియా టాప్ గేర్….

ఆసియాకప్ లో ప్రస్తుత చాంపియన్ టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్ లీగ్ లో రెండుకు రెండు విజయాలు సాధించిన టీమిండియా… సూపర్ ఫోర్ … తొలిరౌండ్లో సైతం భారీవిజయం సాధించింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన పోటీలో బంగ్లాదేశ్ ను 7 వికెట్లతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి… ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న టీమిండియా… ప్రత్యర్థి బంగ్లాదేశ్ ను 49.1 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూల్చింది.

టీమిండియా బౌలర్లలో లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. సమాధానంగా..
174 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా 36.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే విజేతగా నిలిచింది.

కెప్టెన్ రోహిత్ శర్మ 104 బాల్స్ లో 3 సిక్సర్లు, 5 బౌండ్రీలతో 83 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు.
టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

First Published:  22 Sep 2018 6:54 AM GMT
Next Story