Telugu Global
CRIME

పరువు హత్య.... ఇప్పుడిదే స్ఫూర్తి అయిపోయింది....

ఎమైనా మంచి పనులు చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అవే స్ఫూర్తిగా నిలుస్తాయి. కానీ హత్యలు కూడా స్ఫూర్తి అవుతాయా.? అదీ అత్యంత కిరాతకంగా చేసిన ‘పరువు’ హత్యలను కూడా కొందరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారా.? ఇంత కర్కశ వైఖరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి వచ్చింది..? మనుషులందరూ కులాల కోసం ఎందుకిలా చంపుకుంటున్నారు.. పరువు కోసం కన్నవారికే గుండెకోతను ఎందుకు మిగులుస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. తాజాగా మిర్యాలగూడలో ప్రణయ్ అనే తక్కువ కులానికి చెందిన యువకుడిని పెళ్లి […]

పరువు హత్య.... ఇప్పుడిదే స్ఫూర్తి అయిపోయింది....
X

ఎమైనా మంచి పనులు చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అవే స్ఫూర్తిగా నిలుస్తాయి. కానీ హత్యలు కూడా స్ఫూర్తి అవుతాయా.? అదీ అత్యంత కిరాతకంగా చేసిన ‘పరువు’ హత్యలను కూడా కొందరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారా.? ఇంత కర్కశ వైఖరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి వచ్చింది..? మనుషులందరూ కులాల కోసం ఎందుకిలా చంపుకుంటున్నారు.. పరువు కోసం కన్నవారికే గుండెకోతను ఎందుకు మిగులుస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది.

తాజాగా మిర్యాలగూడలో ప్రణయ్ అనే తక్కువ కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో వైశ్య సామాజికవర్గానికి చెందిన అమృతపై ఆమె తండ్రి మారుతీరావు కక్ష గట్టి ప్రణయ్ ని కిరాయి మూకలతో చంపించేశాడు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మనవతావాదులు, ప్రభుత్వాలు, పార్టీలు కూడా స్పందించి అమృతకు న్యాయం చేస్తామని ప్రతిమబూనారు. అయితే ఈ ‘పరువు’ హత్యలను కొందరు సమర్ధిస్తుండడం… కొందరు స్ఫూర్తి పొందడం సంచలనంగా మారింది.

తాజాగా విజయవాడ సత్యనారాయణపురంలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. నగరంలోని శివాలయం వీధిలో సోని, రాహు ప్రియ త్వరలో పరువు హత్యకు గురికాబోతున్నారంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లు చూసి భయాందోళన గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి సోని, రాహుప్రియ ఎవరనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారిని కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాదు.. పోస్టర్లు ఎవరు అంటేశారనే దానిపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

ఇలా సంచలనం సృష్టించిన పరువు హత్యలు కూడా స్ఫూర్తిగా తీసుకోవడం.. పలువురి పేర్లను బహిరంగంగా రాసి మరీ చంపుతామని బెదిరించడం విషసంస్కృతికి అద్ధం పడుతోంది. ఈ పరువు హత్యలు ఇలాగే కొనసాగితే ఏంటనే దానిపై అందరిలోనూ ఆందోళన మొదలైంది. మనుషుల్లో మానవత్వం కంటే కులపట్టింపులే ఎక్కువయ్యాయని ఈ తాజా ఘటన రుజువుచేస్తోంది.

First Published:  22 Sep 2018 7:40 AM GMT
Next Story