Telugu Global
NEWS

అన్నీ సరే.... లోకేష్ కథేంటి మరి?

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు బాగా ప్రిపేర్ అవుతోందని అనుకూల మీడియా ద్వారా లీకులు వదులుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే టికెట్ల కసరత్తు కూడా మొదలుపెట్టేశారని అంటున్నారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు డిసైడ్ చేసేస్తున్నాడట. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై బాబు కసరత్తు చేస్తున్నాడని.. ఆ సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేస్తున్నాడని అనుకూల మీడియా వర్గాలు వార్తలను అచ్చేస్తున్నాయి. ఈ హడావుడి అంతా బాగానే ఉంది కానీ, ఇంతకీ చంద్రబాబు నాయుడు […]

అన్నీ సరే.... లోకేష్ కథేంటి మరి?
X

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు బాగా ప్రిపేర్ అవుతోందని అనుకూల మీడియా ద్వారా లీకులు వదులుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే టికెట్ల కసరత్తు కూడా మొదలుపెట్టేశారని అంటున్నారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబు డిసైడ్ చేసేస్తున్నాడట. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై బాబు కసరత్తు చేస్తున్నాడని.. ఆ సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసేస్తున్నాడని అనుకూల మీడియా వర్గాలు వార్తలను అచ్చేస్తున్నాయి.

ఈ హడావుడి అంతా బాగానే ఉంది కానీ, ఇంతకీ చంద్రబాబు నాయుడు తన తనయుడి విషయంలో ఏం చేయబోతున్నాడు? అనేది చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తాడా? చేయడా? అనేది ఇప్పటికీ మిస్టరీనే. అసలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేష్ ఎంట్రీ ఇచ్చిన విధానమే కామెడీగా ఉంది. ఒక ముఖ్యమంత్రి తనయుడు అయ్యుండి కూడా…. లోకేష్ బాబు నామినేటెడ్ పోస్టుతో ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గలేక ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడనే విమర్శను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇక అలా నామినేటెడ్ పోస్టుతోనే లోకేష్ బాబు మంత్రి కూడా అయిపోయాడు.

ఇప్పటికే ఇలా లోకేష్ నవ్వుల పాలవుతున్నాడు. మాటలు కూడా కోటలు దాటించేలా మాట్లాడే లోకేష్.. ప్రత్యక్ష రాజకీయంలో మాత్రం సత్తా చాటలేకపోయాడు. చేతగాని వాడిలా నామినేటెడ్ పోస్టుతో మంత్రి అయ్యాడు. అది కూడా గొప్ప అయినట్టుగా లోకేష్ చెప్పుకుంటున్నాడు.

ఇక ఇన్నాళ్లూ జరిగిన సంగతలా ఉంటే.. రేపటి ఎన్నికల్లో లోకేష్ ఏం చేయబోతున్నాడు? అనేదానికి ఇంకా సమాధానం లేదు. వచ్చే ఎన్నికల్లో అయినా లోకేష్ పోటీ చేస్తాడా? లేక తనకు అంత సీన్ లేదన్నట్టుగా ఎమ్మెల్సీగానే మిగిలిపోతాడా? అనే అంశంపై చర్చ సాగుతోంది. ఒకవైపు టీడీపీ తరఫున టికెట్లు ఖరారు అయిపోతున్నాయని చెబుతున్నారు కాబట్టి…. లోకేష్ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

First Published:  22 Sep 2018 9:00 AM GMT
Next Story