Telugu Global
NEWS

ఫిరాయింపు నేతలందరిదీ ఓటమి భయమేనా...?

ఏపీ రాజకీయంలో ఫిరాయింపు నేతలకు ఓటమి భయం పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చాలా మంది ఫిరాయింపుదార్లు వేరే నియోజకవర్గాలను వెతుక్కొనే పనిలో పడ్డట్టుగా ఉన్నారు. తాము ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు నుంచి మళ్లీ పోటీ చేస్తే గెలవడం సంగతేమోగానీ డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని, అందుకే మరో నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతామని వీరు చంద్రబాబు వద్ద ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు…. చాలా మంది నేతల పరిస్థితి ఇలానే ఉంది. అందునా […]

ఫిరాయింపు నేతలందరిదీ ఓటమి భయమేనా...?
X

ఏపీ రాజకీయంలో ఫిరాయింపు నేతలకు ఓటమి భయం పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చాలా మంది ఫిరాయింపుదార్లు వేరే నియోజకవర్గాలను వెతుక్కొనే పనిలో పడ్డట్టుగా ఉన్నారు. తాము ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు నుంచి మళ్లీ పోటీ చేస్తే గెలవడం సంగతేమోగానీ డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని, అందుకే మరో నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతామని వీరు చంద్రబాబు వద్ద ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు…. చాలా మంది నేతల పరిస్థితి ఇలానే ఉంది.

అందునా మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు అయితే తమ ప్రస్తుత నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేస్తే జనాలు ఛీ కొడతారని భయపడుతున్నారట. ఇప్పటికే ఈ జాబితాలో మంత్రులు ఆదినారాయణ రెడ్డి, అమరనాథ్ రెడ్డిలు తేలారు. ఆది జమ్మలమడుగులో మళ్లీ పోటీ చేసే సాహసం చేసేలా లేడు. ఇక అమరనాథ్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలో వేరే ఎవరైనా పోటీ చేయండి, తను వేరే రూటు చూసుకుంటా అంటున్నాడట.

ఇలా ఈ ఇద్దరు ఫిరాయింపు మంత్రులు వేరే నియోజకవర్గాల వేటలో ఉంటే… మరో మంత్రి అఖిలప్రియను చంద్రబాబు నాయుడే వేరే నియోజకవర్గానికి పంపనున్నాడని తెలుస్తోంది. ఆమెను నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేయమని అంటున్నాడట చంద్రబాబు నాయుడు. అయితే అఖిలప్రియ అంత బాధ్యతను నెత్తికెత్తుకుంటుందా? అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

ఇక మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా వీలైతే వేరే నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఛాన్సు దక్కుతుందా? అనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం వాళ్లకు వేరే చోట ఛాన్సులు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

First Published:  22 Sep 2018 7:02 PM GMT
Next Story