చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స

తెలుగు ఇండస్ట్రీ లో ఒక నిర్మాత వరుస హిట్స్ కొట్టడం అనేది చాలా అరుదు. అందులోను స్టార్ హీరోస్ ని పెట్టుకొని మరి కొట్టడం అనేది చాలా కష్టం. కానీ మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది “రంగస్థలం” సినిమాని ప్రొడ్యూస్ చేసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు ఈ నిర్మాతలు.

అయితే ఇప్పుడు వీళ్ళు ఒక చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేసే పనిలో ఉన్నారట. రితేష్ అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారట మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు.

మైత్రి మూవీ మేకర్స్ లో భాగం అయిన నవీన్ ఇంకా రవి ఈ మధ్య కొత్త కథలు వింటున్నారట. ఈ నేపధ్యంలోనే రితేష్ చెప్పిన కథ నచ్చి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకి వచ్చారు నిర్మాతలు. అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమా లో అందరు కొత్త వాళ్ళే నటించే అవకాశం ఉంది.