Telugu Global
Others

దురాగతాలను పెంచే పంజాబ్ బిల్లు

గురు గ్రంథ్ సాహెబ్, ఖురాన్, బైబిల్, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేసే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి వీలుగా పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భారత శిక్షా స్మృతి లోని 295-ఎ సెక్షన్ ను సవరిస్తూ భారత శిక్షా స్మృతి (పంజాబ్ సవరణ) బిల్లు-2018 తీసుకొచ్చింది. ఈ బిల్లును పంజాబ్ శాసనసభ ఆమోదించింది. కాంగ్రెస్ కు శిరోమణి అకాలీ దళ్ కు మధ్య ఉన్న వివాదం ఈ శాసనం రూపొందడానికి కారణం. అంతకు […]

దురాగతాలను పెంచే పంజాబ్ బిల్లు
X

గురు గ్రంథ్ సాహెబ్, ఖురాన్, బైబిల్, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేసే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి వీలుగా పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భారత శిక్షా స్మృతి లోని 295-ఎ సెక్షన్ ను సవరిస్తూ భారత శిక్షా స్మృతి (పంజాబ్ సవరణ) బిల్లు-2018 తీసుకొచ్చింది. ఈ బిల్లును పంజాబ్ శాసనసభ ఆమోదించింది.

కాంగ్రెస్ కు శిరోమణి అకాలీ దళ్ కు మధ్య ఉన్న వివాదం ఈ శాసనం రూపొందడానికి కారణం. అంతకు ముందు అధికారంలో ఉన్న అకాలీ దళ్ గురు గ్రంథ్ సాహెబ్ ను అపవిత్రం చేసే వారిని శిక్షించడానికి మాత్రమే ఇంతకు ముందే బిల్లు ప్రతిపాదించింది.

అయితే ఈ బిల్లు రాజ్యాంగంలో పేర్కొన్న సెక్యులరిజం అన్న భావనను ఉల్లంఘిస్తోందని భావించి కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ బిల్లును శాసనసభకు వెనక్కు పంపించింది. అన్ని మతాల పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేయడాన్ని నివారించడానికి తాము ఇప్పుడీ బిల్లు తీసుకొచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

ఇది సర్వ మత సమభావం పేర సెక్యులరిజాన్ని తలకిందులు చేయడానికి ప్రయత్నించడమే. సెక్యులరిజానికి కట్టుబడి ఉండాలంటే పవిత్ర అపవిత్ర అన్న భావనలు దాటి అలాంటి పనులను అపచారంగా భావించాలి.

ఈ బిల్లులో దైవదూషణ అన్న మాట వాడకపోయినా దాని అంతరార్థం మాత్రం దైవ దూషణ చట్టాలతో సంబంధం ఉన్నదే. అయితే దైవదూషణను నివారించే చట్టాలు చాలా వరకు ఉదారవాద ప్రజాస్వామ్యాని సెక్యులరిజం అన్న భావనను చాలా పరిమితార్థంతో ఉద్దేశించినవే.

పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేయకూడదన్న ఆలోచన రాజ్యాధికారాన్ని వినియోగించుకుని ఇలాంటివాటిని నిరోధించాలను కోవడంలో భాగమేనన్న విమర్శ కూడా ఉంది. ఈ బిల్లు దైవ దుషణను నిరోధించే బిల్లుల అసలు ప్రయోజనాన్ని గ్రహించక పోవడమే. కొన్ని భావాలను, ఆలోచనలను, మర్యాదలను, విలువలను విమర్శించడానికి వీలు లేదని వాదించడమంటే కొన్ని రకాల అధికారాలు విమర్శలకు అతీతమైనవని గట్టిగా నమ్మడమే.

పవిత్రతకు సంబంధించిన ఆలోచనలు నిజానికి రాజకీయపరమైన ఆలోచనలే. ఇవి సంపూర్ణంగా మత ధర్మాలకు పరిమితమైన వేమీ కావు. అధికారంలో ఉన్న వారు విమర్శలకు అతీతులు అన్న భావనతో సాగే ఆలోచనలే.

యూదు-క్రైస్తవ మత నియమాలను హిందూ మతంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నది ప్రస్తుత పంజాబ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై ఉన్న మరో విమర్శ. ఈ విమర్శలు చేసే వారు. పవిత్ర గ్రంథాల జాబితాలో భగవద్గీతను చేర్చడమే దీనికి నిదర్శనం అంటున్నారు. ఇది బహుళత్వానికి, సహనశీలతకు విరుద్ధం అని వాదిస్తున్నారు.

కానీ ఈ వాదన చేసే వారు చారిత్రకంగా జరిగిన వేధింపులను, నాస్తికులను, వైదిక ధర్మాన్ని విశ్వసించని వారిని, సంప్రదాయ వ్యతిరేకులను సంఘం నుంచి బహిష్కరించారన్న వాస్తవాలను దృష్టిలో ఉంచుకోవడం లేదు. ఇలాంటి భావాలున్న వ్యక్తులను, సమూహాలను సంఘ బహిష్కారానికి గురి చేశారు. కులాల ఆధారంగా ఉన్న ఆచారాలనూ గమనించడం లేదు. దీనివల్ల దైవదూషణను నిరోధించే చట్టాలు మన సమాజంలో సంఘ బహిష్కారానికే ఎక్కువగా ఉపయోగపడతాయి.

ఈ రుగ్మత రాజకీయ వ్యవస్థలో కూడా చొరబడుతుంది. ఏ వాదన చేసే వారైనా పవిత్రత అన్న భావనను విమర్శించడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి విమర్శలనే దైవ దూషణగా భావిస్తారు. కానీ సెక్యులర్ భావాలను పరిరక్షించడానికి ఈ విమర్శలే అవసరం. అందుకే ప్రంజాబ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు సెక్యులర్ భావనకూ నిబద్ధమై ఉండడానికి, పరిరక్షించడానికి ఉపకరించదని బాహాటంగా చెప్పలేకపోతున్నారు.

ఇటీవలి కాలంలో మత విశ్వాసాలకు, ఏదో ఒక సమాజ అస్తిత్వానికి విఘాతం కలుగుతుందన్న వాదనతో కొన్ని గ్రంథాలను, నాటకాలను, కళాఖండాలను నిషేధించాలన్న గోల పెరిగిపోయింది. పవిత్ర గ్రంథాల మీద సద్విమర్శను కూడా సహించలేని పరిస్థితి ఎక్కువ అవుతోంది. ఇలా సహించలేని హిందుత్వవాద బృందాలు ముంబైలో నాటకాలు ప్రదర్శిస్తున్న రెండు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. పవిత్రత పేర ఆధిపత్య ధోరణిని ఖాతరు చేయకపోవడం, దేవుళ్లను పరిహసించడం జానపద సంస్కృతిలో భాగం. దీని ఆధారంగా మరాఠీ నాటకాన్ని ప్రదర్శించడానికి నిరసనగా హిందుత్వ వాదులు పేలుళ్లకు పాల్పడ్డారు.

సంప్రదాయ పరిరక్షకులం అని చెప్పుకునే వారు మతాధిపత్యాన్ని విమర్శించే సంప్రదాయాన్ని సహించలేకపోయారు. పంజాబ్ శాసనసభ ఆమోదించిన శాసనం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల వారు ఏదో ఒక వర్గం ఒత్తిడికి లొంగి ఇలాంటి బిల్లులే ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ శాసనలు మతాల, కొన్ని వర్గాలలో ఉన్న దురాచారాలను, దుష్ట సంప్రదాయాలను అంతర్నిహితంగా విమర్శించడానికి అడ్డుకట్ట వేస్తాయి. ఎందుకంటే దైవ దూషణకు సంబంధించిన శాసనాలను తీసుకొచ్చేది ఆధిపత్యం చెలాయించే వర్గాలే కాబట్టి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మూక దాడులకు పాల్పడే వారికి మరింత శక్తినివ్వడానికి ఉపకరిస్తాయి.

తమకు అధికారంలో ఉన్నవారి అండదండలున్నాయన్న ధీమా ఇలాంటి దాడులకు పాల్పడే వారికి ఉంటుంది కనక ఇది అత్యంత ప్రమాదకరం. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే దుండగులకు చట్టబద్ధత కల్పించినట్టు అవుతుంది. గోవులను రక్షించే పేర, గొడ్డు మాంసం తినడాన్ని అరికట్టే పేర దురాగతాలను ఇటీవలి కాలంలో చాలానే చూశాం. ఇతర వర్గాల వారి మీద విద్వేషం పెంచే వారికి, దాడులకు దిగే వారికి తమను ఇక శిక్షించే వారే లేరన్న ధైర్యం వస్తుంది. ఇది మన రాజకీయ వ్యవస్థలో, సమాజంలో సెక్యులర్ భావజాలానికి తావు లేకుండా చేయడమే.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  23 Sep 2018 8:36 PM GMT
Next Story