Telugu Global
CRIME

క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తి రాఘ‌వేశ్వ‌ర భార‌తిపై చార్జ్‌షీటు

క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తి రాఘ‌వేశ్వ‌ర భార‌తిపై సిఐడి చార్జ్‌షీటు దాఖ‌లు చేసింది. శిమోగా జిల్లాలో రామ‌చంద్ర‌పుర మ‌ఠాధిప‌తి అయిన రాఘ‌వేశ్వ‌ర భార‌తి ఓ భ‌క్తురాలిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌నే ఫిర్యాదుతో సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. బాధిత మ‌హిళ భ‌ర్త‌పై కూడా కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి భ‌ర్త‌ను స‌హ నిందితుడిగా గుర్తించారు. బాధిత మ‌హిళ గిరిన‌గ‌ర్ పోలీసుల‌కు చేసిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి రంగంలోకి దిగింది. కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిస్తోంది. బాధిత మ‌హిళ చెప్పిన వివ‌రాల […]

క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తి రాఘ‌వేశ్వ‌ర భార‌తిపై చార్జ్‌షీటు
X

క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తి రాఘ‌వేశ్వ‌ర భార‌తిపై సిఐడి చార్జ్‌షీటు దాఖ‌లు చేసింది. శిమోగా జిల్లాలో రామ‌చంద్ర‌పుర మ‌ఠాధిప‌తి అయిన రాఘ‌వేశ్వ‌ర భార‌తి ఓ భ‌క్తురాలిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌నే ఫిర్యాదుతో సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. బాధిత మ‌హిళ భ‌ర్త‌పై కూడా కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో బాధితురాలి భ‌ర్త‌ను స‌హ నిందితుడిగా గుర్తించారు.

బాధిత మ‌హిళ గిరిన‌గ‌ర్ పోలీసుల‌కు చేసిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి రంగంలోకి దిగింది. కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలిస్తోంది. బాధిత మ‌హిళ చెప్పిన వివ‌రాల ప్ర‌కారం…. రాఘ‌వేశ్వ‌ర భార‌తి ఆమెపై రెండు సార్లు అత్యాచారం చేసిన‌ట్లు తెలిసింది.

తాను తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు రాఘ‌వేశ్వ‌ర భార‌తి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని ఆ మ‌హిళ ఫిర్యాదు చేసింది. ఆ త‌ర్వాత ఆశ్ర‌మంలో ఉన్న ఒక ఉద్యోగితో బ‌ల‌వంతంగా పెళ్లి చేశార‌ని ఆమె తెలిపింది. 2012లో రాఘ‌వేశ్వ‌ర భార‌తి మ‌రోసారి త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలియ‌జేసింది. 2015లో ఆమె ఫిర్యాదు న‌మోదు చేయ‌గా ఇప్ప‌టికి చార్జ్‌షీటు దాఖ‌ల‌యింది. ఇంత కాలంగా ద‌ర్యాప్తు చేస్తున్న అధికారులు త‌గిన ఆధారాలు సేక‌రించారు.

క‌ర్ణాట‌క‌లో వీరిదే రాజ్యం…

హ‌వ్య‌క బ్రాహ్మ‌ణులకు క‌ర్ణాట‌క‌లో మంచి ప‌ర‌ప‌తి ఉంది. పోలీసు శాఖ‌, న్యాయ‌శాఖ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌భుత్వ ప‌ద‌వుల్లో కీల‌క స్థానాల్లో హ‌వ్య‌క బ్రాహ్మ‌ణుల‌దే పైచేయి. రాఘ‌వేశ్వ‌ర భార‌తి కూడా హ‌వ్య‌క బ్రాహ్మ‌ణుడు కావ‌డంతో ఆయ‌న‌పై కేసులు నిల‌వ‌డం లేదు. గ‌తంలో కూడా అనేక కేసులు న‌మోద‌యినా చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవు.

ప్ర‌స్తుతం వెలుగులోకి వ‌చ్చిన అత్యాచారం కేసు కూడా నీరుగార్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. దీంతో ఆగ్ర‌హించిన విద్యార్ధి సంఘాలు, మ‌హిళా సంఘాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. కేసు పోలీసుల నుంచి సిఐడికి చేరింది. ద‌ర్యాప్తులో పురోగ‌తి క‌నిపిస్తోంది.

First Published:  24 Sep 2018 12:45 AM GMT
Next Story