Telugu Global
Cinema & Entertainment

మరోసారి నాగార్జున సరసన అనుష్క

క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున “బంగార్రాజు” అనే సినిమా చేయ‌నున్నాడు అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అక్కినేని నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి ఇది ప్రీక్వేల్ గా తెరకెక్కుతుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే క‌ళ్యాణ్ కృష్ణ ప్రీక్వెల్ కోసం చాలా క‌థ‌లు నాగ్‌కి వినిపించాడ‌ట‌. ఏ క‌థ న‌చ్చ‌లేద‌ని చెప్పాడ‌ట‌ నాగార్జున. ఫైన‌ల్‌గా […]

మరోసారి నాగార్జున సరసన అనుష్క
X

క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున “బంగార్రాజు” అనే సినిమా చేయ‌నున్నాడు అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అక్కినేని నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి ఇది ప్రీక్వేల్ గా తెరకెక్కుతుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే క‌ళ్యాణ్ కృష్ణ ప్రీక్వెల్ కోసం చాలా క‌థ‌లు నాగ్‌కి వినిపించాడ‌ట‌. ఏ క‌థ న‌చ్చ‌లేద‌ని చెప్పాడ‌ట‌ నాగార్జున. ఫైన‌ల్‌గా క‌ళ్యాణ్ కృష్ణ చెప్పిన ఓ క‌థ‌కి నాగ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ప్ర‌స్తుతం ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట క‌ళ్యాణ్ కృష్ణ‌.

అయితే ఇందులో నాగ్ స‌ర‌స‌న అనుష్క న‌టించ‌నుంద‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అక్కినేని నాగార్జున , అనుష్క ది హిట్ కాంబినేషన్. ఇది వరకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “సూపర్” “డమరుకం” “రగడ” వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. మళ్ళి ఇన్నేళ్ళ తరువాత వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయానికి సంభందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే నాగార్జున ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  24 Sep 2018 10:36 PM GMT
Next Story