Telugu Global
Cinema & Entertainment

హిట్ దర్శకుడి దర్శకత్వంలో బాలకృష్ణ....

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “ఎన్టీఆర్” బయోపిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 9 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే “ప‌టాస్” “సుప్రీమ్” “రాజా ది గ్రేట్” చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో “ఎఫ్ 2” అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా […]

హిట్ దర్శకుడి దర్శకత్వంలో బాలకృష్ణ....
X

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “ఎన్టీఆర్” బయోపిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 9 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే “ప‌టాస్” “సుప్రీమ్” “రాజా ది గ్రేట్” చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నాడు.

ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో “ఎఫ్ 2” అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుక‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య సినిమా స్టార్ట్ చేస్తాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఇప్పటికే బాలకృష్ణ కోసం పక్క కమర్షియల్ కథ ఒకటి రెడీ చేసుకున్నాడు అని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ గ్యాప్ లో బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తాడు అనే టాక్ ఉంది. మరి ఈ సినిమాలో బాలకృష్ణ ఏ సినిమా ముందు చేస్తాడో చూడాలి.

First Published:  25 Sep 2018 1:55 AM GMT
Next Story