Telugu Global
CRIME

రేపిస్టుల అడ్డాగా మారిన అసోం

అసోం రాష్ట్రం రేపిస్టుల‌కు అడ్డాగా మారింది. పోలీసు యంత్రాంగం నుంచి క‌ఠిన చ‌ర్య‌లు లేక‌పోవ‌డంతో రేపిస్టులు రెచ్చిపోతున్నారు. స్త్రీలను బ‌లాత్కారాలు చేస్తున్నారు. ఎటువంటి శిక్ష‌లు ప‌డ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నారు. బిజెపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ రెండేళ్ల‌లో అసోంలో 4,130 అత్యాచార కేసులు న‌మోద‌య్యాయి. వ‌ర‌క‌ట్న సంబందిత కేసులు 15,000 న‌మోద‌య్యాయి. అసోం గ‌ణ‌ప‌రిష‌త్ శాస‌న‌స‌భ్యుడు రామేంద్ర నారాయ‌ణ్ క‌లితా అసెంబ్లీ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి చంద్ర మోహ‌న్ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్ర హోం […]

రేపిస్టుల అడ్డాగా మారిన అసోం
X

అసోం రాష్ట్రం రేపిస్టుల‌కు అడ్డాగా మారింది. పోలీసు యంత్రాంగం నుంచి క‌ఠిన చ‌ర్య‌లు లేక‌పోవ‌డంతో రేపిస్టులు రెచ్చిపోతున్నారు. స్త్రీలను బ‌లాత్కారాలు చేస్తున్నారు. ఎటువంటి శిక్ష‌లు ప‌డ‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్నారు.

బిజెపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఈ రెండేళ్ల‌లో అసోంలో 4,130 అత్యాచార కేసులు న‌మోద‌య్యాయి. వ‌ర‌క‌ట్న సంబందిత కేసులు 15,000 న‌మోద‌య్యాయి. అసోం గ‌ణ‌ప‌రిష‌త్ శాస‌న‌స‌భ్యుడు రామేంద్ర నారాయ‌ణ్ క‌లితా అసెంబ్లీ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి చంద్ర మోహ‌న్ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు.

రాష్ట్ర హోం మంత్రి కూడా అయిన సోనోవాల్‌కు బ‌దులుగా మంత్రి చంద్ర మోహ‌న్ నేరాల వివ‌రాల‌ను గ‌ణాంకాల‌తో స‌హా స‌భ‌కు తెలియ‌జేశారు.1543 కిడ్నాప్ కేసులు, 457 లైంగిక వేధింపుల కేసులు కూడా న‌మోదైన‌ట్లు మంత్రి చంద్ర మోహ‌న్ తెలిపారు.

First Published:  25 Sep 2018 2:55 AM GMT
Next Story