Telugu Global
NEWS

చింతకాయల, గిడ్డి ఈశ్వరికి కూడా హెచ్చరికలు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును మావోయిస్టులు హత్య చేయడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎన్నికల ఏడాది ఇలాంటి ఘటన జరగడం అధికార పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో గ్రామాల్లో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకుండాపోయిందన్న ఆందోళన వారిలో ఉంది. ఎమ్మెల్యే హత్య తర్వాత పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలను వదిలేసి సిటీల్లో కాపురం ఉండాలని సూచనలు జారీ చేశారు. మరింత మంది […]

చింతకాయల, గిడ్డి ఈశ్వరికి కూడా హెచ్చరికలు
X

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును మావోయిస్టులు హత్య చేయడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎన్నికల ఏడాది ఇలాంటి ఘటన జరగడం అధికార పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో గ్రామాల్లో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేకుండాపోయిందన్న ఆందోళన వారిలో ఉంది.

ఎమ్మెల్యే హత్య తర్వాత పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాలను వదిలేసి సిటీల్లో కాపురం ఉండాలని సూచనలు జారీ చేశారు. మరింత మంది అధికార పార్టీ నేతలను మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపైనా మావోయిస్టులు ఆగ్రహంగా ఉన్నారు.

ఆమె మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్నారని ఏప్రిల్‌లోనే నిఘా వర్గాలు ఆమెను హెచ్చరించారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన తర్వాత వీరు మైనింగ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నది మావోయిస్టుల కోపానికి కారణం. అటు మైనింగ్‌లో వందల కోట్లు కూడబెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు కుమారుడు కూడా మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు.

ఇప్పటికే పలుమార్లు చింతకాయల కుమారుడికి హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే ఆయన తీరు మారలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే హత్యతో చింతకాయల కుటుంబం కూడా అలజడికి గురవుతోంది. మావోయిస్టుల హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడానికి లేదని గతంలో జరిగిన సంఘటనలను పోలీసులు గుర్తు చేస్తున్నారు.

గతంలో మంత్రి మణికుమారి భర్త వెంకట్రాజును కూడా పలుమార్లు హెచ్చరించి ఆ తర్వాత పాడేరులో పట్టపగలే మావోయిస్టులు హతమార్చారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు శ్రీనును గొలుగొండ మండలం జోగంపేట వద్ద మావోయిస్టులు గతంలో హత్య చేశారు.

ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి ఇప్పటికే వార్నింగ్‌లు అందుకున్న టీడీపీ నేతలు, వారి కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. సిటీలకు మకాం మార్చే పనిలో ఉన్నారు. ఎన్నికల ఏడాది ఈ పరిస్థితి రావడం టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారింది.

First Published:  24 Sep 2018 10:30 PM GMT
Next Story