Telugu Global
NEWS

హరీష్ రావును మించిపోవాలని కేటీఆర్ పెద్ద స్కెచ్

మంత్రి హరీష్ రావు… కేసీఆర్ చాటున మేనల్లుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు టీఆర్ఎస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎంతలా అంటే తెలంగాణలో గడిచిన ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని సాధించి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేశాడు. అందుకే ఇటీవల ఇబ్రహీంపూర్ అనే గ్రామానికి హరీష్ వస్తే జోరు వర్షంలోనూ బతుకమ్మలు, డప్పు చప్పుళ్ల మధ్య హరీష్ కు ఘన స్వాగతం పలికారు. నాయకుడి కళ్లలో నీళ్లు తిరిగేలా చేశారు. హరీష్ లో […]

హరీష్ రావును మించిపోవాలని కేటీఆర్ పెద్ద స్కెచ్
X

మంత్రి హరీష్ రావు… కేసీఆర్ చాటున మేనల్లుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇప్పుడు టీఆర్ఎస్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎంతలా అంటే తెలంగాణలో గడిచిన ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని సాధించి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేశాడు. అందుకే ఇటీవల ఇబ్రహీంపూర్ అనే గ్రామానికి హరీష్ వస్తే జోరు వర్షంలోనూ బతుకమ్మలు, డప్పు చప్పుళ్ల మధ్య హరీష్ కు ఘన స్వాగతం పలికారు. నాయకుడి కళ్లలో నీళ్లు తిరిగేలా చేశారు.

హరీష్ లో ఓ ప్రత్యేకత ఉంది. తన నియోజకవర్గంలో ఏ పెళ్లి జరిగినా ఆయన వెళ్లి 1000 రూపాయాలు కట్నం చదివించి వధూవరులను ఆశీర్వదించి వస్తారు. పేదలు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా అందరితో మాట్లాడుతారు. సమస్యలు తెలుసుకుంటారు. అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువే నిధులు తెచ్చి అందరికీ లబ్ధి చేకూర్చుతాడు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా ఎదిగాడు.

ఇప్పుడు బావ చూపిన బాటలో బావమరిది మంత్రి కేటీఆర్ కూడా సక్సెస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీర్చే బట్ట ఉత్పత్తిని అంతా తన సిరిసిల్ల నేతన్నలకే కాంట్రాక్ట్ ఇచ్చాడు. బతుకమ్మ చీరలు, ఆస్పత్రుల్లో బెడ్ షీట్లు సహా కస్తూర్భా, గురుకులాల దుప్పట్లు, వస్త్రాలు, విద్యార్థులకు యూనిఫాం బట్ట అంతా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే ఉత్పత్తి అవుతోంది.

అంతేకాదు… ఏది ప్రభుత్వం లాంచ్ చేసినా మొదట సిరిసిల్లకే కేటీఆర్ కేటాయిస్తున్నారు. డబుల్ బెడ్ రూంలు ఎన్నో కట్టిస్తున్నారు. సైనిక్ పాఠశాలలు, అంతర్జాతీయ డ్రైవింగ్ కేంద్రం, రోడ్లు, కావాల్సినన్ని నిధులు, అడిగిన వారికి అడగని వారికి సంక్షేమ ఫలాలు ఇస్తున్నారట…. గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నాడట..

ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా ముందస్తు ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రక్షన్ అయ్యారు. ఈసారి హరీష్ రావును మించిపోవాలని కేటీఆర్ పావులు కదుపుతున్నట్టు తెలిసింది. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రత్యేకంగా టెస్కాబ్ చైర్మన్ కొండూరి ఆధ్వర్యంలో గ్రామాల్లోని కుల సంఘాలు, ఇతర పార్టీల నాయకులను ఆకర్షిస్తూ గ్రామాలకు గ్రామాలు కేటీఆర్ కే ఓటు అని తీర్మానం చేయిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నట్టు సమాచారం.

ఈసారి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేటీఆర్ నే సీఎం చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో హరీష్ ను మించి సిరిసిల్లలో మెజార్టీ సాధించాలని కేటీఆర్ కృతనిశ్చయంతో ఉన్నాడట. ఇందుకోసం అందరు నియోజకవర్గ నాయకులతో ఫోన్లో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. హరీష్ ను మించి అత్యధిక ప్రజాదరణ సాధిస్తే సీఎం సీటుకు మార్గం సుగమం అవుతుందని కేటీఆర్ స్కెచ్ గీసినట్టు తెలిసింది. మరి ప్రజాదరణలో హరీష్, కేటీఆర్ లలో జనాల మద్దతు ఎవరికి అత్యధికం అనేది రానున్న ఎన్నికల్లో తేలనుంది.

First Published:  25 Sep 2018 4:06 AM GMT
Next Story