Telugu Global
Cinema & Entertainment

విషపూరిత ప్రపంచంలోకి నాగశౌర్య

హీరో నాగశౌర్యకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ చాలామందికి తెలిసి ఉండదు. అదేంటంటే.. ఈ హీరో సెల్ ఫోన్ వాడడు. ఇన్నాళ్లూ తనకంటూ ఓ సెల్ ఫోన్ కూడా కొనుక్కోలేదు ఈ హీరో. దీనికి ఆయన చెప్పే రీజన్స్ చాలానే ఉన్నాయి. ఎప్పూడూ తన పక్కన తన అమ్మ లేదా నాన్న ఉంటారని.. లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారని చెబుతున్న నాగశౌర్య.. సెల్ అవసరం తనకు ఇంతవరకు రాలేదన్నాడు అలా సెల్ ఫోన్ కు ఇన్నాళ్లూ దూరంగా […]

విషపూరిత ప్రపంచంలోకి నాగశౌర్య
X

హీరో నాగశౌర్యకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ చాలామందికి తెలిసి ఉండదు. అదేంటంటే.. ఈ హీరో సెల్ ఫోన్ వాడడు. ఇన్నాళ్లూ తనకంటూ ఓ సెల్ ఫోన్ కూడా కొనుక్కోలేదు ఈ హీరో. దీనికి ఆయన చెప్పే రీజన్స్ చాలానే ఉన్నాయి. ఎప్పూడూ తన పక్కన తన అమ్మ లేదా నాన్న ఉంటారని.. లేదంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారని చెబుతున్న నాగశౌర్య.. సెల్ అవసరం తనకు ఇంతవరకు రాలేదన్నాడు

అలా సెల్ ఫోన్ కు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న ఈ హీరో, ఇప్పుడు సడెన్ గా ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. అంతేకాదు, తన స్మార్ట్ ఫోన్ చూసిస్తూ ఓ సెల్ఫీ కూడా దిగాడు. దాన్ని ట్విట్టర్ లో పెట్టాడు. ఈ పాడు ప్రపంచంలోకి నేను కూడా వచ్చేశా అనే అర్థం కలిగేలా ఓ చిన్న స్టేట్ మెంట్ కూడా వదిలాడు.

నిజంగా సెల్ ఫోన్ లేకుండా ఇన్నాళ్లు గడపడం నిజంగా విచిత్రమనే చెప్పాలి. సెల్ ఫోన్, ఫేస్ బుక్ లేని మనుషుల్ని వింతగా చూసే రోజులివి. అలాంటిది ఏకంగా ఓ హీరోకే సెల్ ఫోన్ లేదంటే ఆశ్చర్యమే. సరే.. ఈ విషయాల్ని పక్కనపెడితే, ఇన్నాళ్లూ సెల్ ఫోన్ లేకుండా గడిపిన నాగశౌర్య, ఇప్పుడు ఉన్నఫలంగా ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడనగానే చాలామందికి అనుమానాలు మొదలయ్యాయి. ఈ హీరో లవ్ లో పడ్డాడని, తన లవర్ తో మాట్లాడేందుకు, ఛాట్ చేసేందుకు ఇలా స్మార్ట్ ఫోన్ కొన్నాడని పుకార్లు మొదలయ్యాయి.

First Published:  25 Sep 2018 7:15 AM GMT
Next Story