Telugu Global
Cinema & Entertainment

చెర్రీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు యూనిట్. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా విడుదల ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ ఆ తేదీకి సైరా హంగామా పెట్టుకున్నారు. మొన్నటికిమొన్న వినాయకచవితిని కూడా యూనిట్ మిస్ చేసింది. ఎట్టకేలకు చరణ్ సినిమా ఫస్ట్ లుక్ […]

చెర్రీ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
X

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకథాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు యూనిట్. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా విడుదల ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ ఆ తేదీకి సైరా హంగామా పెట్టుకున్నారు. మొన్నటికిమొన్న వినాయకచవితిని కూడా యూనిట్ మిస్ చేసింది. ఎట్టకేలకు చరణ్ సినిమా ఫస్ట్ లుక్ కు డేట్ ఫిక్స్ చేశారు.

దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని నిర్ణయించారు. నిజానికి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను రిలీజ్ చేయడం పెద్ద సమస్య కాదు. కావాలనుకుంటే 2 నెలల కిందటే విడుదల చేసి ఉండొచ్చు. కానీ సినిమా విడుదలకు ఇంకా చాలా టైం ఉండడంతో, అప్పుడే విడుదల చేస్తే మూవీపై బజ్ తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ వేచిచూశారు. దసరాను కూడా మిస్ చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ లోగోను విడుదల చేయబోతున్నారు.

బోయపాటి, చరణ్ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా ఇదే. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  24 Sep 2018 9:08 PM GMT
Next Story