Telugu Global
NEWS

కోదండ‌రాం సీటుపై స‌స్పెన్స్ ఎందుకో?

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ‌రామ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఆయ‌న ఏ సీటును ఎంచుకుంటారు? ఆయ‌న ఎన్నిక‌ల లెక్క‌లు ఏంటి? అనే విష‌యాలలో స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. తెలంగాణ జ‌న‌సమితి నేత‌లే కాదు… ఇతర పార్టీల నేతలు కూడా కోదండ‌రాం ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అధికార‌ప‌క్షం కోదండ‌రాం ఏ సీటు నుంచి బ‌రిలోకి దిగుతారో అని ఎదురుచూస్తోంది. కోదండ‌రాం సొంతూరు మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉంది. అక్కడ సింగ‌రేణి కార్మికులు […]

కోదండ‌రాం సీటుపై స‌స్పెన్స్ ఎందుకో?
X

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ‌రామ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఆయ‌న ఏ సీటును ఎంచుకుంటారు? ఆయ‌న ఎన్నిక‌ల లెక్క‌లు ఏంటి? అనే విష‌యాలలో స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. తెలంగాణ జ‌న‌సమితి నేత‌లే కాదు… ఇతర పార్టీల నేతలు కూడా కోదండ‌రాం ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అధికార‌ప‌క్షం కోదండ‌రాం ఏ సీటు నుంచి బ‌రిలోకి దిగుతారో అని ఎదురుచూస్తోంది.

కోదండ‌రాం సొంతూరు మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉంది. అక్కడ సింగ‌రేణి కార్మికులు ఎక్కువ‌. మ‌రీ ఆయ‌న అక్క‌డి నుంచి పోటీ చేస్తారా? అనే విష‌యం డౌట్‌. వరంగల్‌ వెస్ట్, ఉప్పల్‌, జనగామ నియోజకవర్గాలలో ఏదో ఒక చోట నుంచి ఆయన పోటీ చేయవచ్చు. కోదండరాం లెక్క‌ల ప్రకారం పూర్తిగా అర్బ‌న్ ప్రాంతం కాకుండా…. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతాలు క‌లిసి ఉన్న నియోజ‌క‌వ‌ర్గం అయితే త‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని ఆయ‌న లెక్క‌లు వేస్తున్నార‌ట‌.

మ‌రోవైపు విద్యావంతులు అధికంగా ఉన్న వరంగల్‌ వెస్ట్‌లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? అని కోదండ‌రాం ఇప్ప‌టికే ఎన్నిక‌ల లెక్క‌లు వేస్తున్నారు. అదే స‌ర్వేలు గ‌ట్రా చేస్తున్నార‌ని తెలుస్తోంది. వరంగల్‌ వెస్ట్‌ పరిధిలోనే కాకతీయ యూనివర్సిటీ ఉండటం, అధ్యాపకులతో పాటు మెజారిటీ విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తారనే అంచనా ఉంది. పలు విద్యాసంస్థలు, ఇతర పెద్దపెద్ద వ్యాపారులు, కాంట్రాక్టర్లు, డాక్టర్లు, లాయర్లు ఇలా అన్ని రంగాల్లో ఉన్న రెడ్డి సామాజికవర్గం కోదండరామ్‌కు స్వాగతం ప‌లుకుతోంది.

వ‌రంగ‌ల్‌వెస్ట్‌లో ఉన్న ప‌రిస్థితులే ఉప్ప‌ల్‌లో ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఉస్మానియా యూనివ‌ర్శిటీకి ద‌గ్గ‌రగా ఉంది. తార్నాక‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో కోదండ‌రాంకు మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశం క‌న్పిస్తోంది. అయితే మ‌హాకూట‌మి త‌ర‌పున ఇక్క‌డ టీడీపీ నేత దేవేంద‌ర్‌గౌడ్ కొడుకు వీరేంద‌ర్‌గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు.

జ‌నగామ‌లో కూడా కోదండ‌రాంకు అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయ‌నేది టీజేఎస్ పెద్ద‌ల భావ‌న‌. అయితే మ‌హాకూట‌మిలో సీట్ల పంప‌కాలు పూర్తి కావాలి. ఎన్నిక‌ల నోటిఫికేషన్ రావాలి. అప్ప‌టి వ‌ర‌కూ కోదండ‌రాం సీటు ర‌హ‌స్యంగా ఉంచాలి అని టీజేఎస్ నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

First Published:  24 Sep 2018 8:58 PM GMT
Next Story