Telugu Global
National

ప్రపంచ గోల్ఫ్ లో పడిలేచిన కెరటం టైగర్ వుడ్స్

ఐదేళ్ల విరామం తర్వాత తొలి పీజీఏ టూర్ టైటిల్ నెగ్గిన టైగర్ కెరియర్ లో 80వ టూర్ ట్రోఫీ అందుకొన్న గోల్ఫ్ దిగ్గజం గ్లోబల్ గేమ్ గోల్ఫ్ ఆల్ టైమ్ గ్రేట్…టైగర్ వుడ్స్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత…తన కెరియర్ లో 80వ టైటిల్ సాధించాడు. తన అసాధారణ కెరియర్ లో 14 మేజర్ టైటిల్స్ తో సహా.. మొత్తం 79 PGA టూర్ టైటిల్స్ సాధించిన టైగర్…80వ టైటిల్ కోసం మాత్రం ఐదేళ్లపాటు […]

ప్రపంచ గోల్ఫ్ లో పడిలేచిన కెరటం టైగర్ వుడ్స్
X
  • ఐదేళ్ల విరామం తర్వాత తొలి పీజీఏ టూర్ టైటిల్ నెగ్గిన టైగర్
  • కెరియర్ లో 80వ టూర్ ట్రోఫీ అందుకొన్న గోల్ఫ్ దిగ్గజం

గ్లోబల్ గేమ్ గోల్ఫ్ ఆల్ టైమ్ గ్రేట్…టైగర్ వుడ్స్ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చాడు.

ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత…తన కెరియర్ లో 80వ టైటిల్ సాధించాడు. తన అసాధారణ కెరియర్ లో 14 మేజర్ టైటిల్స్ తో సహా.. మొత్తం 79 PGA టూర్ టైటిల్స్ సాధించిన టైగర్…80వ టైటిల్ కోసం మాత్రం ఐదేళ్లపాటు వేచిచూడాల్సి వచ్చింది.

వివాహేతర సంబంధాలతో గతితప్పి… ప్రొఫెషనల్ గోల్ఫ్ కు దూరమైన టైగర్ వుడ్స్… అట్లాంటా ఈస్ట్ లేక్ గోల్ఫ్ కోర్స్ లో ముగిసిన పీజీఏ టూర్ టైటిల్ ను నెగ్గి తనకు తానే సాటిగా నిలిచాడు. టైగర్ వుడ్స్ ఈ అరుదైన విజయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టైగర్ అభిమానులు పొంగిపోయారు.

First Published:  25 Sep 2018 11:42 AM GMT
Next Story