Telugu Global
National

విశ్వనాథన్ ఆనంద్ టు విరాట్ కొహ్లీ....

ఖేల్ రత్న విజేతగా మూడో క్రికెటర్ సచిన్, మహేంద్రసింగ్ ధోనీల సరసన కొహ్లీ రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలకు 28 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది. 1990 నుంచి 2018 వరకూ వివిధ క్రీడలకు చెందిన మొత్తం 30 మంది దిగ్గజ క్రీడాకారులు ఈ పురస్కారాన్ని అందుకొన్న వారిలో ఉన్నారు. విజేతలు ఎందరు ఉన్నా… ఖేల్ రత్న అందుకొన్న తొలి క్రీడాకారుడి ఘనత భారత చదరంగ సామ్రాట్ విశ్వనాథన్ ఆనంద్ కు మాత్రమే దక్కుంది. 1991-92 సీజన్ కు […]

విశ్వనాథన్ ఆనంద్ టు విరాట్ కొహ్లీ....
X
  • ఖేల్ రత్న విజేతగా మూడో క్రికెటర్
  • సచిన్, మహేంద్రసింగ్ ధోనీల సరసన కొహ్లీ

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలకు 28 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది. 1990 నుంచి 2018 వరకూ వివిధ క్రీడలకు చెందిన మొత్తం 30 మంది దిగ్గజ క్రీడాకారులు ఈ పురస్కారాన్ని అందుకొన్న వారిలో ఉన్నారు.

విజేతలు ఎందరు ఉన్నా… ఖేల్ రత్న అందుకొన్న తొలి క్రీడాకారుడి ఘనత భారత చదరంగ సామ్రాట్ విశ్వనాథన్ ఆనంద్ కు మాత్రమే దక్కుంది. 1991-92 సీజన్ కు ఆనంద్ ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

తొలి మహిళ కరణం మల్లీశ్వరి….

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందుకొన్న తొలి భారత మహిళ గౌరవాన్ని తెలుగుతేజం కరణం మల్లీశ్వరి దక్కించుకొంది. ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు తొలిపతకం అందించడం ద్వారా 1994-95 సంవత్సరానికి మల్లీశ్వరి ఈ పురస్కారానికి ఎంపికయ్యింది.

తొలి క్రికెటర్ సచిన్ టెండుల్కర్….

భారత్ లో అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్. ఒలింపిక్స్ లో అసలు క్రీడాంశమే కాని క్రికెట్లో…తన అసాధారణ ప్రతిభతో, అనితర సాధ్యమైన రికార్డులతో మాస్టర్ సచిన్ టెండుల్కర్ రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందుకొన్న తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 1997-98 సంవత్సరానికి మాస్టర్ ఈ గౌరవాన్ని సంపాదించాడు.

అంతేకాదు…ఒకే క్రీడకు చెందిన క్రీడాకారుడికి మాత్రమే కాదు… సంయుక్త విజేతలను ప్రకటించే సాంప్రదాయానికి 1993-94 సీజన్ నుంచే శ్రీకారం చుట్టారు. తెరచాప పడవల క్రీడాకారులు హోమీ మోతీవాలా, పుష్ప్పేంద్ర కుమార్ గార్గ్ లకు ఖేల్ రత్నను అందచేశారు.

ఆ తర్వాత..2002లో అథ్లెట్ బినామోల్, షూటర్ అంజలీ భగవత్ లకు సంయుక్తంగా పురస్కారాన్ని ఇచ్చారు. 2016 సీజన్ లో బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, కుస్తీ క్రీడలకు చెందిన పీవీ సింధు, దీప కర్మాకర్, జీతూ రాయ్, సాక్షీ మాలిక్ కలిసి ఈ అవార్డును అందుకొన్నారు.

తెలుగు వెలుగుల ఖేల్ రత్నాలు…

ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికైన తెలుగురాష్ట్రాల క్రీడాకారులలో కరణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, గగన్ నారంగ్, సానియా మీర్జా, పీవీ సింధు ఉన్నారు. రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు మరింత మంది రాజీవ్ ఖేల్ రత్నాలుగా మిగిలిపోవాలని కోరుకొందాం. వివాదాలకు అతీతంగా ఉంటేనే ఈ అవార్డు గౌరవం మరింత పెరుగుతుందని కేంద్రప్రభుత్వం, ఎంపిక సంఘాల పెద్దలు గ్రహిస్తే మంచిది.

సంవత్సరం – అథ్లెట్ – క్రీడ

1991-92 వి. ఆనంద్ చదరంగం

1992-93 గీత్ సేథీ బిలియర్డ్స్

1993-94 మోతీవాలా, గర్గ్ యాటింగ్

1994-95 కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్

1995-96 కుంజరాణి దేవి వెయిట్ లిఫ్టింగ్

1996-97 లియాండర్ పేస్ టెన్నిస్

1997-98 సచిన్ టెండుల్కర్ క్రికెట్

1998-99 జ్యోతిర్మయ్ సిక్దర్ అథ్లెటిక్స్

99-2000 ధన్ రాజ్ పిళ్లై హాకీ

2000-01 పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్

2001 అభినవ్ బింద్రా షూటింగ్

2002 బినామోల్, అంజలీ భగవత్ అథ్లెటిక్స్, షూటింగ్

2003 అంజు బాబీ జార్జి అథ్లెటిక్స్

2004 రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ షూటింగ్

2005 పంకజ్ అద్వానీ బిలియర్డ్స్

2006 మానవజిత్ సింగ్ సంధు షూటింగ్

2007 మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్

2009 మేరీకోమ్, విజేందర్, సుశీల్ బాక్సింగ్, కుస్తీ

2010 సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్

2011 గగన్ నారంగ్ షూటింగ్

2012 విజయ్ కుమార్, యోగేశ్వర్ దత్ షూటింగ్, కుస్తీ

2013 రంజన్ సింగ్ సోథీ షూటింగ్

2015 సానియా మీర్జా టెన్నిస్

2016 సింధు, దీప, సాక్షి, జీతురాయ్ బ్యాడ్మింటన్, షూటింగ్, కుస్తీ,జిమ్నాస్టిక్స్

2017 సర్దార్ సింగ్ హాకీ

2018 చాను , విరాట్ కొహ్లీ వెయిట్ లిప్టింగ్, క్రికెట్

First Published:  25 Sep 2018 1:02 AM GMT
Next Story