Telugu Global
National

నాలుగు రోజుల్లో 40 మంది పోలీసు అధికారుల రాజీనామా

జమ్ముకశ్మీర్‌లో పోలీసు అధికారుల వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. పోలీసు ఉద్యోగాలు వదులుకోవాలని లేకుంటే చంపేస్తామంటూ ఉగ్రవాద సంస్థ హిజుబుల్ హెచ్చరించడంతో కొందరు పోలీసు అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. ఇటీవల ముగ్గురు పోలీసు అధికారులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు వారిని దారుణంగా హత్య చేయడంతో కొందరు పోలీసుల్లో మరింత భయం పెరిగింది. నాలుగు రోజుల్లో 40మంది స్పెషల్ పోలీసు అధికారులు రాజీనామా చేశారు. ఉగ్రవాద సంస్థ హెచ్చరిక వల్లే తాము రాజీనామా చేశామంటూ కొందరు వీడియోలు కూడా […]

నాలుగు రోజుల్లో 40 మంది పోలీసు అధికారుల రాజీనామా
X

జమ్ముకశ్మీర్‌లో పోలీసు అధికారుల వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. పోలీసు ఉద్యోగాలు వదులుకోవాలని లేకుంటే చంపేస్తామంటూ ఉగ్రవాద సంస్థ హిజుబుల్ హెచ్చరించడంతో కొందరు పోలీసు అధికారులు రాజీనామాలు చేస్తున్నారు.

ఇటీవల ముగ్గురు పోలీసు అధికారులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు వారిని దారుణంగా హత్య చేయడంతో కొందరు పోలీసుల్లో మరింత భయం పెరిగింది. నాలుగు రోజుల్లో 40మంది స్పెషల్ పోలీసు అధికారులు రాజీనామా చేశారు. ఉగ్రవాద సంస్థ హెచ్చరిక వల్లే తాము రాజీనామా చేశామంటూ కొందరు వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అక్కడి పరిస్థితిపై సమీక్ష జరిపింది. భయంతో పోలీసు అధికారులు రాజీనామా చేస్తున్నారన్న వార్తలను డిపార్ట్‌మెంట్ ఖండించింది. జమ్ముకశ్మీర్‌లో 30వేల మంది స్పెషల్ పోలీసు అధికారులు ఉన్నారని.. ఓ 40మంది రాజీనామా చేయడం అన్నది పెద్ద విషయం కాదంటున్నారు. ఒకవేళ పిరికితనంతో ఎవరైనా రాజీనామా చేస్తే అలాంటి వారి వల్ల వచ్చే నష్టం ఏమీ లేదంటున్నారు ఉన్నతాధికారులు.

First Published:  25 Sep 2018 9:32 PM GMT
Next Story