Telugu Global
NEWS

ధనవంతుల జాబితాలో భువనేశ్వరి

భారతదేశంలో అత్యంత ధనికుల జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చోటు సంపాదించారు. దేశంలో వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న వారి జాబితాను బార్‌క్లేస్ హురున్ ఇండియా రిచ్-2018 పేరుతో  విడుదల చేశారు. బార్‌క్లేస్ జాబితాలో 3.71లక్షల కోట్ల సంపదతో ముకేష్ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు. 2017తో పోలిస్తే ఈ ఏడాది వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న భారతీయుల జాబితాలోకి మరింత మంది వచ్చి చేరారు. 2017లో వెయ్యి కోట్లకు పైగా […]

ధనవంతుల జాబితాలో భువనేశ్వరి
X

భారతదేశంలో అత్యంత ధనికుల జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చోటు సంపాదించారు. దేశంలో వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న వారి జాబితాను బార్‌క్లేస్ హురున్ ఇండియా రిచ్-2018 పేరుతో విడుదల చేశారు. బార్‌క్లేస్ జాబితాలో 3.71లక్షల కోట్ల సంపదతో ముకేష్ అంబానీ తొలి స్థానంలో ఉన్నారు.

2017తో పోలిస్తే ఈ ఏడాది వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న భారతీయుల జాబితాలోకి మరింత మంది వచ్చి చేరారు. 2017లో వెయ్యి కోట్లకు పైగా సంపద ఉన్న వారు 617 మంది ఉండగా ఈసారి ఆ సంఖ్య 831కి చేరింది. ముంబై నుంచి ఈ జాబితాలో అత్యధికంగా 233 మంది చోటు సంపాదించారు.

తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 46మంది ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 1200 కోట్ల సంపదతో ఈజాబితాలో చోటు దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంపద ఉన్న వారి జాబితాలో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రమోటర్ పిపిరెడ్డి (13వేల కోట్ల సంపద)మొదటి స్థానంలో ఉన్నారు.

తర్వాతి స్థానంలో హెటెరో ఫార్మా అధినేత బి పార్థసారథిరెడ్డి(12వేల 800 కోట్లు) ఉన్నారు. మూడో స్థానంలోనూ మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ మరో ప్రమోటర్ పి. వి. కృష్ణారెడ్డి(12వేల 400 కోట్లు) నిలిచారు. నాలుగో స్థానంలో మైహోమ్ రామేశ్వరరావు ఉన్నారు. ఆయన సంపద రూ. 8వేల 100 కోట్లు.

First Published:  25 Sep 2018 11:00 PM GMT
Next Story