Telugu Global
International

రొనాల్డో, మెస్సీ పోయే... లూకా మాడ్రిక్ వచ్చే

పిఫా అవార్డుల రేస్ లో సరికొత్త శకం మాడ్రిచ్ కు పిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య వార్షిక అవార్డుల్లో…. క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీల ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. గత దశాబ్దకాలంగా పిఫా అవార్డులు గెలుచుకొంటూ వచ్చిన క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ  2018 పిఫా వ్యక్తిగత అవార్డుల్లో…. ఆచూకీనే లేకుండా పోయారు. క్రొయేషియా మిడ్ ఫీల్డర్ లూకా మాడ్రిచ్ తొలిసారిగా పిఫా అత్యుత్తమ ఆటగాడి అవార్డును అందుకొన్నాడు. అత్యుత్తమ ఆటగాడి అవార్డు […]

రొనాల్డో, మెస్సీ పోయే... లూకా మాడ్రిక్ వచ్చే
X
  • పిఫా అవార్డుల రేస్ లో సరికొత్త శకం
  • మాడ్రిచ్ కు పిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డు

ప్రపంచ ఫుట్ బాల్ సమాఖ్య వార్షిక అవార్డుల్లో…. క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీల ఆధిపత్యానికి ఎట్టకేలకు తెరపడింది. గత దశాబ్దకాలంగా పిఫా అవార్డులు గెలుచుకొంటూ వచ్చిన క్రిస్టియానో రొనాల్డో, లయనల్ మెస్సీ 2018 పిఫా వ్యక్తిగత అవార్డుల్లో…. ఆచూకీనే లేకుండా పోయారు.

క్రొయేషియా మిడ్ ఫీల్డర్ లూకా మాడ్రిచ్ తొలిసారిగా పిఫా అత్యుత్తమ ఆటగాడి అవార్డును అందుకొన్నాడు. అత్యుత్తమ ఆటగాడి అవార్డు కోసం క్రిస్టియానో రొనాల్డో, ఈజిప్టు స్టార్ ప్లేయర్ మహ్మద్ సలా, లూకా మాడ్రిచ్ ల పేర్లను పరిశీలించారు.

చివరకు ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా కెప్టెన్ మాడ్రిచ్ నే అవార్డు వరించింది.

మహిళల విభాగంలో బ్రెజిల్ ప్లేయర్ మార్తాకు అత్యుత్తమ క్రీడాకారిణి అవార్డు దక్కింది. లండన్ లో ముగిసిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో మార్డిచ్, లూకా పురస్కారాలు అందుకొన్నారు.

గత 11 సంవత్సరాల కాలంలో అవార్డుల రేస్ లో లయనల్ మెస్సీ లేకపోడం ఇదే మొదటిసారి.

First Published:  25 Sep 2018 8:10 PM GMT
Next Story