Telugu Global
National

చంద్రబాబుకు షాకిచ్చేలా మోడీ ప్లాన్

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎత్తుగడను ప్రధాని కూడా ఫాలో అవ్వబోతున్నారా.? లోక్ సభను నవంబర్ లోనే రద్దు చేయబోతున్నారా.? అంటే బీజేపీ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. జమిలీ ఎన్నికల కోసం ప్లాన్ చేస్తున్న బీజేపీ అది సాధ్యం కాని పరిస్థితుల్లో లోక్ సభకు ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది. ఆ లోక్ సభతో పాటు దగ్గర్లో ఎన్నికలుండే రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం […]

చంద్రబాబుకు షాకిచ్చేలా మోడీ ప్లాన్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎత్తుగడను ప్రధాని కూడా ఫాలో అవ్వబోతున్నారా.? లోక్ సభను నవంబర్ లోనే రద్దు చేయబోతున్నారా.? అంటే బీజేపీ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది.

జమిలీ ఎన్నికల కోసం ప్లాన్ చేస్తున్న బీజేపీ అది సాధ్యం కాని పరిస్థితుల్లో లోక్ సభకు ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది. ఆ లోక్ సభతో పాటు దగ్గర్లో ఎన్నికలుండే రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం లీకైంది.

దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిశాక.. జనవరిలో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఖాయంగా వస్తాయంటున్నారు. దీంతో పాటు తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలు జనవరిలో అందరితోపాటు జరుగనున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు నో చెబుతున్నారు. ఈసారి ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అందుకే ముందస్తుకు నో చెబుతున్నారు.. కానీ ఏపీ అసెంబ్లీకి మే 15 వరకు గడువు ఉన్నా ఆరు నెలలు ముందుగానే ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ఆ మేరకు ఎన్నికల కమీషన్ కు సర్వాధికారాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తేరుకునే లోపే లోక్ సభను రద్దు చేసి ప్రత్యర్థి పార్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేసే ఆలోచనలో మోదీ, అమిత్ షా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నవంబర్ లో లోక్ సభ రద్దు జరిగితే జనవరిలో దేశవ్యాప్తంగా లోక్ సభ, కాలపరిమితి ముగిసే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల కోసం నానా హంగామా కనిపిస్తోంది. అన్ని పార్టీలు సమరానికి సై అనేలా అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో ఇంకా సమయం ఉంది కదా అని పార్టీలు కొంచెం కూల్ గా ఉన్నా, ఎవరి వ్యూహాలను వారు రచించుకుంటున్నారు. అయితే, ఏపీకి కూడా షాకిచ్చేలా కేంద్రం ఉంది. ఏపీకి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

పూర్తి కాలం ప్రభుత్వాన్ని నడుపుతామంటూ చంద్రబాబు చెబుతున్నా, ఆరు నెలలు ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఎలక్షన్ కమిషన్ కు ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అంటే ఏపీ ప్రభుత్వ ప్రమేయం లేకుండానే ఎన్నికలు ఏపీలో కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

సెప్టెంబరు 6న తెలంగాణ అసెంబ్లీ రద్దయ్యింది. ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఇక్కడ నవంబర్ లో ఎన్నికలు నిర్వహించి.. తిరిగి లోక్ సభకు జనవరిలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కేసీఆర్ కు వచ్చే ముప్పేమి లేదు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీలో ప్రతిపక్షనేత జగన్ వ్యాఖ్యలు కూడా లోక్ సభ ముందస్తు ఎన్నికలకు సంకేతాలిస్తున్నాయి.

First Published:  26 Sep 2018 1:51 AM GMT
Next Story