Telugu Global
National

ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషికి ఉద్వాస‌న త‌ప్ప‌దా?

బిజెపి సీనియ‌ర్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి సాహ‌సం చేశారు. ఎస్టిమేట్స్ క‌మిటీ చైర్మ‌న్ హోదాలో ప్ర‌ధాని కార్యాల‌యానికి 12 రోజుల క్రితం నోటీసులు పంపారు. రిజ‌ర్వ్ బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్ అందించిన కార్పోరేట్ డిఫాల్ట‌ర్ల జాబితాను అందించాల‌ని కోరారు. వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నారో తెలపాల‌ని వివ‌ర‌ణ కోరారు. ప్ర‌ధాని కార్యాల‌యంతో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్, విద్యుత్, బొగ్గు శాఖ‌ల‌కు కూడా నోటీస‌లు జారీ చేశారు. వివ‌ర‌ణ కోరారు. […]

ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషికి ఉద్వాస‌న త‌ప్ప‌దా?
X

బిజెపి సీనియ‌ర్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి సాహ‌సం చేశారు. ఎస్టిమేట్స్ క‌మిటీ చైర్మ‌న్ హోదాలో ప్ర‌ధాని కార్యాల‌యానికి 12 రోజుల క్రితం నోటీసులు పంపారు. రిజ‌ర్వ్ బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురాం రాజ‌న్ అందించిన కార్పోరేట్ డిఫాల్ట‌ర్ల జాబితాను అందించాల‌ని కోరారు. వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నారో తెలపాల‌ని వివ‌ర‌ణ కోరారు. ప్ర‌ధాని కార్యాల‌యంతో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్న‌ర్ ఊర్జిత్ ప‌టేల్, విద్యుత్, బొగ్గు శాఖ‌ల‌కు కూడా నోటీస‌లు జారీ చేశారు. వివ‌ర‌ణ కోరారు. ఈ ప‌రిణామాలన్నీ మోడీకి మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హారాలే. ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డే వారిని అడ్డుతొల‌గించుకోవడం మోడీకి, అమిత్ షాకి అల‌వాటైన ప‌నే.

బిసి ఖండూరీకి ఉద్వాసన‌

డిఫెన్స్ పార్లమెంట‌రీ క‌మిటీకి చైర్మ‌న్‌గా ఉన్న బిసి ఖండూరీని కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గించింది. ఆ స్థానంలో క‌ల్‌రాజ్ మిశ్రాను నియ‌మించింది. ఆర్మీ బ‌ల‌గాల స‌న్న‌ద్ధ‌త (Defence preparedness) పూర్తిస్థాయిలో లేదని ఘండూరీ నేతృత్వంలో క‌మిటీ కొన్ని వారాల క్రితం పేర్కొంది. దీంతో ఆగ్ర‌హించిన మోడీ స‌ర్కార్ ఖండూరీకి ఉద్వాస‌న ప‌లికింది. ఆ స్థానంలో తాము చెప్పిన‌ట్లు వ్య‌వ‌హ‌రించే క‌ల్‌రాజ్ మిశ్రాకు చోటు క‌ల్పించింది.

అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్ హ‌యాములో స్వర్ణచతుర్భుజి వంటి ప్రాజెక్టును విజ‌య‌వంతంగా పూర్తి చేసిన ఘ‌న‌త ఖండూరీది. అటువంటి ఖండూరీని కూడా మోడీ ఉపేక్షించ‌లేదు. ప‌ద‌వి నుంచి తప్పించారు.

లోక్‌స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌… జోషి వ్య‌వ‌హారం కూడా త‌ల‌నొప్పిగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తుండడంతో మోడీ ఏం చేయ‌నున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ఖండూరీని పీకిపారేసిన‌ట్లే జోషిని కూడా పీకిపారేస్తారా? స‌ంఘ ప‌రివార్ మూలాలు బ‌లంగా క‌లిగిన మ‌నోహ‌ర్ జోషిని ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం సాధ్య‌మేనా ? అలా చేస్తే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ చూస్తూ ఊరుకుంటుందా ? వ‌ంటి ప‌లు సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

First Published:  26 Sep 2018 1:40 AM GMT
Next Story