Telugu Global
National

రాఫెల్ డీల్‌.... కాంగ్రెస్‌కు మ‌రో ఆయుధం.... నిర్మ‌లా సీతారామ‌న్ అబ‌ద్దాలు చెబుతున్నారు....

రాఫెల్ డీల్‌పై బిజెపిని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్‌కు మ‌రో ఆయుధం దొరికింది. ఆఫ్‌సెట్ పార్ట్‌న‌ర్‌ను ఎంపిక చేయడంలో ప్ర‌భుత్వం పాత్ర ఏమీ లేద‌ని ఇంత కాలం చెబుతున్న ర‌క్ష‌ణ మంత్రిని నిల‌దీసేందుకు కాంగ్రెస్ నాయ‌కుల‌కు అవ‌కాశం దొరికింది. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజ‌ర్‌లో ఉన్న కొన్ని నిబంధ‌న‌లు…. బిజెపి అబ‌ద్ధాలు చెబుతుంద‌ని చెప్పేందుకు ఆస్కారం క‌లిగిస్తున్నాయి. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజ‌ర్ 2013/2016 ప్ర‌కారం ఆఫ్ సెట్ పార్ట్‌న‌ర్‌ని ఎంపిక చేయాలంటే కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌, ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన […]

రాఫెల్ డీల్‌.... కాంగ్రెస్‌కు మ‌రో ఆయుధం.... నిర్మ‌లా సీతారామ‌న్ అబ‌ద్దాలు చెబుతున్నారు....
X

రాఫెల్ డీల్‌పై బిజెపిని ఇరుకున పెడుతున్న కాంగ్రెస్‌కు మ‌రో ఆయుధం దొరికింది. ఆఫ్‌సెట్ పార్ట్‌న‌ర్‌ను ఎంపిక చేయడంలో ప్ర‌భుత్వం పాత్ర ఏమీ లేద‌ని ఇంత కాలం చెబుతున్న ర‌క్ష‌ణ మంత్రిని నిల‌దీసేందుకు కాంగ్రెస్ నాయ‌కుల‌కు అవ‌కాశం దొరికింది. డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజ‌ర్‌లో ఉన్న కొన్ని నిబంధ‌న‌లు…. బిజెపి అబ‌ద్ధాలు చెబుతుంద‌ని చెప్పేందుకు ఆస్కారం క‌లిగిస్తున్నాయి.

డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజ‌ర్ 2013/2016 ప్ర‌కారం ఆఫ్ సెట్ పార్ట్‌న‌ర్‌ని ఎంపిక చేయాలంటే కేంద్ర ర‌క్ష‌ణ శాఖ‌, ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన డిఫెన్స్ ఎక్విజిష‌న్ వింగ్‌ల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని… కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌పిల్ సిబ‌ల్ తెలిపారు.

డిఫెన్స్ కొనుగోళ్ల‌కు మాస్ట‌ర్ డాక్యుమెంట్ వంటిదైన డిపిపి (డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజ‌ర్) ను ఎందుకు ఉల్లంఘించార‌ని క‌పిల్ సిబ‌ల్ ప్ర‌శ్నించారు. ర‌క్ష‌ణ మంత్రి ఈ విష‌య‌మై స‌మాధానం చెప్పాల‌ని సిబ‌ల్ డిమాండ్ చేశారు.

ఎంతో అనుభ‌వం క‌లిగిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాద‌ని… అనుభ‌వం లేని రిల‌యెన్స్ డిఫెన్స్ వంటి ఓ ప్రైవేట్ సంస్థ‌ను ఆఫ్‌సెట్ పార్ట్‌న‌ర్‌గా ఎంపిక చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు ఉల్లంఘించింద‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఆఫ్‌సెట్ పార్టనర్ ఎంపికలో ప్ర‌భుత్వ ప్ర‌మేయం లేదంటూ ఇంత‌కాలంగా చెబుతున్న నిర్మ‌లా సీతారామ‌న్ అబ‌ద్దాలు చెబుతున్నార‌ని క‌పిల్ సిబ‌ల్ అన్నారు.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ‌ను కాద‌ని రిల‌యెన్స్ వంటి అనుభ‌వం లేని సంస్థ‌ను ఆఫ్‌సెట్ పార్ట్‌న‌ర్ గా ఎంపిక చేయ‌డంలో ప్ర‌ధాని ఆదేశాలు త‌ప్ప‌నిస‌రిగా ఉన్నాయ‌ని సిబ‌ల్ ఆరోపించారు.

First Published:  25 Sep 2018 8:01 PM GMT
Next Story