Telugu Global
National

డిసెంబ‌ర్ 16న సైనా నెహ్వాల్ వివాహం

బ్యాడ్మింట‌న్ సెన్సేష‌న్ సైనా నెహ్వాల్ వివాహ తేదీ ఖ‌రార‌యింది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 16న ఆమె… త‌న ప్రియుడు పారుప‌ల్లి క‌శ్య‌ప్‌ను పెళ్లి చేసుకోనుంది. గ‌త కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లిద్ద‌రూ వివాహ బంధంతో ఒక్క‌ట‌వ్వాల‌ని నిర్ణ‌యించు కున్నారు. డిసెంబ‌ర్ 10న జ‌రిగే వివాహానికి కేవ‌లం 100 మందిని మాత్ర‌మే ఆహ్వానించిన‌ట్లు తెలిసింది. డిసెంబ‌ర్ 21 న రిసెప్ష‌న్ ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు గ‌త కొంత కాలంగా పెళ్లి తేదీల‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని…. […]

డిసెంబ‌ర్ 16న సైనా నెహ్వాల్ వివాహం
X

బ్యాడ్మింట‌న్ సెన్సేష‌న్ సైనా నెహ్వాల్ వివాహ తేదీ ఖ‌రార‌యింది. ఈ ఏడాది డిసెంబ‌ర్ 16న ఆమె… త‌న ప్రియుడు పారుప‌ల్లి క‌శ్య‌ప్‌ను పెళ్లి చేసుకోనుంది.

గ‌త కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లిద్ద‌రూ వివాహ బంధంతో ఒక్క‌ట‌వ్వాల‌ని నిర్ణ‌యించు కున్నారు. డిసెంబ‌ర్ 10న జ‌రిగే వివాహానికి కేవ‌లం 100 మందిని మాత్ర‌మే ఆహ్వానించిన‌ట్లు తెలిసింది. డిసెంబ‌ర్ 21 న రిసెప్ష‌న్ ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇరు కుటుంబాలు గ‌త కొంత కాలంగా పెళ్లి తేదీల‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని…. ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 16వ తేదీన వీరికి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

2005 నుంచి గ‌చ్చిబౌలిలో గోపీచంద్‌ అకాడ‌మీలో వీరిద్ద‌రూ శిక్షణ తీసుకుంటున్నారు. ప‌దేళ్ల క్రితం వీరిద్దరి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తోంద‌ని ప‌లుమార్లు గుస‌గుస‌లు వినిపించాయి.

బాడ్మింట‌న్ మ‌హిళా విభాగంలో సైనా నెహ్వాల్ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. కెరీర్ మొత్తంలో ఆమె 20 మేజ‌ర్ టైటిల్స్ సాధించింది. ఒలింపిక్స్ లో కాంస్య ప‌త‌కం, వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించింది. కామ‌న్వెల్త్ గేమ్స్‌లో బంగారు ప‌త‌కం సాధించ‌డంలో క‌శ్య‌ప్ పాత్ర ఉంద‌ని సైనా గ‌త ఏడాది వెల్ల‌డించింది. త‌నను ఎంతో మోటివేట్ చేశాడ‌ని చెప్పింది.

పారుప‌ల్లి క‌శ్య‌ప్ కూడా బ్యాడ్మింట‌న్ ప్ర‌పంచంలో త‌న కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. అనేక టైటిల్స్ నెగ్గాడు. ర్యాంకింగ్స్‌లో 6వ స్థానానికి కూడా ఎగ‌బాకాడు. ప్ర‌స్తుతం గాయాల కార‌ణంగా కాస్త వెన‌క‌బ‌డ్డాడు. కెరీర్‌లో ఎత్తుప‌ల్లాలు ఎదురైన‌ప్ప‌టికీ ఎన్న‌డూ నిరాశ చెంద‌కుండా అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తూనే ఉన్నాడు.

First Published:  25 Sep 2018 11:50 PM GMT
Next Story