Telugu Global
Cinema & Entertainment

వెబ్ సిరీస్ చేస్తున్న సందీప్ కిషన్

సందీప్ కిషన్….ఈ పేరు కొన్నేళ్ళ ముందు తెగ పాపులర్ అయ్యింది. వరుస హిట్స్ ని అందుకుంటూ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. “వెంకటాద్రి ఎక్ష్ప్రెస్” తో తోలి బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ హీరో తరువాత తెలుగు లో కొన్ని ఫ్లాప్స్ ని కూడా చవి చూసాడు. ఇక్కడ ఫ్లాప్స్ రాగానే తమిళ్ లో సినిమాలు చేసి అక్కడ ప్రూవ్ చేసుకోడానికి ట్రై చేసాడు సందీప్ కిషన్. కానీ […]

వెబ్ సిరీస్ చేస్తున్న సందీప్ కిషన్
X

సందీప్ కిషన్….ఈ పేరు కొన్నేళ్ళ ముందు తెగ పాపులర్ అయ్యింది. వరుస హిట్స్ ని అందుకుంటూ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. “వెంకటాద్రి ఎక్ష్ప్రెస్” తో తోలి బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ హీరో తరువాత తెలుగు లో కొన్ని ఫ్లాప్స్ ని కూడా చవి చూసాడు. ఇక్కడ ఫ్లాప్స్ రాగానే తమిళ్ లో సినిమాలు చేసి అక్కడ ప్రూవ్ చేసుకోడానికి ట్రై చేసాడు సందీప్ కిషన్. కానీ తమిళ్ లో సందీప్ కిషన్ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.

ప్రస్తుతం సందీప్ కిషన్ చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. అదే “నరగాసురన్”. ఇదే సినిమా తెలుగు లో “నరకాసురుడు” గ డబ్ అవుతుంది. కార్తీక్ నరేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పైనే సందీప్ కిషన్ ఆశలు అన్ని ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు లో ఒక వెబ్ సిరీస్ కి సైన్ చేసాడట సందీప్ కిషన్. అమెజాన్ వారు ఈ వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేయనున్నారు. మరి సినిమాలు లేక వెనకబడ్డ సందీప్ కిషన్ ఈ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులని ఎలా మెప్పిస్తాడో చూడాలి.

First Published:  26 Sep 2018 12:06 AM GMT
Next Story