Telugu Global
National

త్వరలో సుప్రీంకోర్టు లైవ్‌ ప్రసారాలు....

అత్యున్నత న్యాయస్థానంలో జరిగే విచారణ, వాదోపవాదాలు, తీర్పులను చానళ్లలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసే అవకాశం రానుంది. అయితే అన్ని కేసుల్లో కాకపోయినా రాజ్యాంగపరంగా ముఖ్యమైన కేసుల విషయంలో ఇలా ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను, మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఓ తీర్పును వెలువరించింది. స్వప్నిల్‌ త్రిపాఠి, సీనియర్‌ […]

త్వరలో సుప్రీంకోర్టు లైవ్‌ ప్రసారాలు....
X

అత్యున్నత న్యాయస్థానంలో జరిగే విచారణ, వాదోపవాదాలు, తీర్పులను చానళ్లలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూసే అవకాశం రానుంది. అయితే అన్ని కేసుల్లో కాకపోయినా రాజ్యాంగపరంగా ముఖ్యమైన కేసుల విషయంలో ఇలా ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

ఇందుకు సంబంధించిన విధి విధానాలను, మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఓ తీర్పును వెలువరించింది.

స్వప్నిల్‌ త్రిపాఠి, సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌లు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై విచారణ సందర్భంగా బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది. జాతీయ స్థాయి, రాజ్యాంగ పరమైన ప్రాధాన్యత ఉన్న కేసుల్లో విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేసేందుకు అనుమతించాలని జైసింగ్‌ తన పిటిషన్‌లో కోరారు.

ఇందుకు సంబంధించి అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ అభిప్రాయాన్ని కోర్టు కోరింది. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తూ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల ప్రతులను కోర్టుకు సమర్పించారు. త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలను విడుదల చేసి సుప్రీంకోర్టులో అమలు చేయాలని, ఆ తర్వాత ఇతర కోర్టులకూ దానిని వర్తింపజేయాలని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ప్రతిపాదిత మార్గదర్శకాలపై వాదోపవాదాలను విన్న తర్వాత తుది తీర్పును వాయిదా వేసింది.

First Published:  26 Sep 2018 4:40 AM GMT
Next Story