Telugu Global
Cinema & Entertainment

హ్యాట్రిక్ కు ఒక్క సినిమా దూరంలో..

హీరోలు, దర్శకులే కాదు.. హీరోయిన్ల విషయంలో కూడా హ్యాట్రిక్స్ ఉంటాయి. నిజానికి వరుసగా హిట్స్ కొట్టే హీరోయిన్ అంటే అందరికీ క్రేజే. ఆమెను లక్కీ హ్యాండ్ గా ఫీల్ అవుతుంటారు. ప్రస్తుతం రష్మిక ఇలాంటి స్టార్ స్టేటస్ నే ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. దేవదాస్ సినిమా తెలుగులో రష్మికకు వరుసగా మూడో సినిమా. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఈ […]

హ్యాట్రిక్ కు ఒక్క సినిమా దూరంలో..
X

హీరోలు, దర్శకులే కాదు.. హీరోయిన్ల విషయంలో కూడా హ్యాట్రిక్స్ ఉంటాయి. నిజానికి వరుసగా హిట్స్ కొట్టే హీరోయిన్ అంటే అందరికీ క్రేజే. ఆమెను లక్కీ హ్యాండ్ గా ఫీల్ అవుతుంటారు. ప్రస్తుతం రష్మిక ఇలాంటి స్టార్ స్టేటస్ నే ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఈ బ్యూటీ, ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. దేవదాస్ సినిమా తెలుగులో రష్మికకు వరుసగా మూడో సినిమా.

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత గీతగోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించింది. అది ఛలో కంటే ఇంకా పెద్ద హిట్ అయింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రష్మికపై పడింది. రష్మిక ఉంది కాబట్టి.. ఛలో, గీతగోవిందం కంటే దేవదాస్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు చాలామంది.

ప్రస్తుతం ఈ టెన్షన్ లో ఉంది రష్మిక. ఇంటర్వ్యూల్లో కూడా ఆమెకు వరుసగా ఇదే రకమైన ప్రశ్నలు ఎదురుకావడంతో ఆమె టెన్షన్ రెట్టింపు అయింది. రష్మిక సంగతి పక్కనపెడితే, అటు ఆఫీసర్ తో అట్టర్ ఫ్లాప్ అందుకున్న నాగార్జునకు, కృష్ణార్జునయుద్ధం సినిమాతో ఫ్లాప్ కొట్టిన నానికి, దేవదాస్ విజయం తప్పనిసరి.

First Published:  26 Sep 2018 11:32 AM GMT
Next Story