Telugu Global
Cinema & Entertainment

'అరవింద' ప్రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తేదీపై మొన్నటివరకు ఎన్నో తర్జనభర్జనలు కొనసాగాయి. 2వ తేదీ అని కొందరు, 6వ తేదీ అని మరికొందరు, ఏకంగా 8 అంటూ ఇంకొందరు వరుసపెట్టి కథనాలు వండివార్చారు. […]

అరవింద ప్రీ-రిలీజ్ డేట్ ఫిక్స్
X

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అరవింద సమేత చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తేదీపై మొన్నటివరకు ఎన్నో తర్జనభర్జనలు కొనసాగాయి. 2వ తేదీ అని కొందరు, 6వ తేదీ అని మరికొందరు, ఏకంగా 8 అంటూ ఇంకొందరు వరుసపెట్టి కథనాలు వండివార్చారు. ఫైనల్ గా మేకర్స్ ప్రకటనతో ఈ సస్పెన్స్ కు తెరపడింది.

సాధారణంగా సినిమా ఫంక్షన్లన్నీ వీకెండ్స్ లో పెట్టుకుంటారు. కానీ అరవింద సమేత ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 2వ తేదీ పెట్టారు. మరీ ముఖ్యంగా ఆరోజు మంగళవారం పడింది. అలాంటి రోజున సినిమా వాళ్లు ఎవరూ ఫంక్షన్లు పెట్టుకోరు. అరవింద సమేత మాత్రం 2వ తేదీకే మొగ్గుచూపింది. వారాలు, తిథి, జాతకాలు అన్నీ చూసే, మంగళవారం అయినప్పటికీ ఆ రోజును ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు సినిమా విడుదల తేదీపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. దసరా కానుకగా థియేటర్లలోకి వస్తున్నామని చెప్పినప్పటికీ, తేదీని మాత్రం అఫీషియల్ గా ప్రకటించలేదు. ఎట్టకేలకు అక్టోబర్ 11న థియేటర్లలోకి వస్తున్నామంటూ పోస్టర్లు విడుదల చేశారు. ఇక్కడ అక్టోబర్ 11 కూడా వీకెండ్ కాదు. గురువారం పడింది.

First Published:  27 Sep 2018 10:00 AM GMT
Next Story