Telugu Global
NEWS

ఒవైసీ పై పరిపూర్ణానంద పోటీ?

పరిపూర్ణానంద స్వామి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. చాన్స్ వస్తే ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారు. తనను ముందు పెడితే యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ తరహాలో ఉంటుందని పరిపూర్ణానంద ఆలోచన. పరిపూర్ణానంద గురించి టీ బీజేపీలో చర్చ జోరుగానే సాగుతోంది. కార్యకర్తలు పరిపూర్ణనంద ఎపిసోడ్‌పై చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న బీజేపీ నేతలు మాత్రం పరిపూర్ణానంద అంశంపై అసలు మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం […]

ఒవైసీ పై పరిపూర్ణానంద పోటీ?
X

పరిపూర్ణానంద స్వామి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. చాన్స్ వస్తే ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారు. తనను ముందు పెడితే యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ తరహాలో ఉంటుందని పరిపూర్ణానంద ఆలోచన.

పరిపూర్ణానంద గురించి టీ బీజేపీలో చర్చ జోరుగానే సాగుతోంది. కార్యకర్తలు పరిపూర్ణనంద ఎపిసోడ్‌పై చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న బీజేపీ నేతలు మాత్రం పరిపూర్ణానంద అంశంపై అసలు మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదు. త్వరలోనే లడ్డూలాంటి వార్త వింటారంటూ పరిపూర్ణానంద చెప్పడం కూడా కొత్త చర్చకు దారి తీసింది.

ఒకవేళ పరిపూర్ణానంద పార్టీలోకి వస్తే హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి ఒవైసీ పై నిలబెట్టాలని కొందరు బీజేపీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. అసెంబ్లీ అయితే గోషామహల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఓవైసీపై లోక్‌సభకు పోటీ చేసేందుకు పరిపూర్ణానంద సుముఖంగా లేరని చెబుతున్నారు. ఆయన అసెంబ్లీకే పోటీ చేసి తెలంగాణ సీఎం అవ్వాలనుకుంటున్నారు.

కొందరు బీజేపీ నేతలు మాత్రం పరిపూర్ణానంద రాజకీయాల్లోకి రావడం మంచిదే గానీ… మరీ ఎక్కువగా ఊహించుకుంటూ ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకోవడం మాత్రం కొంచెం అతిగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎక్కడో యూపీని చూసుకుని తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంటుందని భావించడం భ్రమే అంటున్నారు.

First Published:  26 Sep 2018 11:35 PM GMT
Next Story