Telugu Global
International

వన్డేల్లో కెప్టెన్ గా ధోనీ డబుల్ సెంచరీ

696 రోజుల విరామం తర్వాత తిరిగి కెప్టెన్సీ ఆసియాకప్ లో అప్ఘనిస్థాన్ పై కెప్టెన్ గా ధోనీ రికీ పాంటింగ్ , స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాతి స్థానంలో ధోనీ టీమిండియా ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ… 696 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆసియాకప్ సూపర్ ఫోర్ ఆఖరిరౌండ్ పోటీలో… టీమిండియాకు నాయకత్వం వహించాడు. ఒకే ఒక్కడు ధోనీ…. మహేంద్రసింగ్ ధోనీ అనగానే….ఎలాంటి ఒత్తిడి కనపడనీయకుండా…. ప్రతికూల పరిస్థితుల్లో సైతం […]

వన్డేల్లో కెప్టెన్ గా ధోనీ డబుల్ సెంచరీ
X
  • 696 రోజుల విరామం తర్వాత తిరిగి కెప్టెన్సీ
  • ఆసియాకప్ లో అప్ఘనిస్థాన్ పై కెప్టెన్ గా ధోనీ
  • రికీ పాంటింగ్ , స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాతి స్థానంలో ధోనీ

టీమిండియా ఎవర్ గ్రీన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ… 696 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే జట్టు పగ్గాలు చేపట్టాడు. ఆసియాకప్ సూపర్ ఫోర్ ఆఖరిరౌండ్ పోటీలో… టీమిండియాకు నాయకత్వం వహించాడు.

ఒకే ఒక్కడు ధోనీ….

మహేంద్రసింగ్ ధోనీ అనగానే….ఎలాంటి ఒత్తిడి కనపడనీయకుండా…. ప్రతికూల పరిస్థితుల్లో సైతం కూల్ కూల్ గా కనిపించే….. త్రీ-ఇన్-వన్ క్రికెటర్ కనిపిస్తాడు.

టీమిండియాకు వన్డే , టీ-20 ఫార్మెట్లలో అసాధారణ సేవలు అందించిన ఒకే ఒక్కడు ధోనీ మాత్రమే.

2016 సీజన్లో చివరిసారిగా టీమిండియా వన్డే జట్టుకు నాయకత్వం వహించిన ధోనీ….696 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత… అనుకోకుండా భారత వన్డే జట్టుకు తిరిగి నాయకత్వం వహించాడు.

రెండేళ్ల తర్వాత కెప్టెన్సీ….

యూఏఈ వేదికగా జరుగుతున్న 2018 ఆసియాకప్ లో… రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ వేటకు దిగిన టీమిండియా జట్టులో…ధోనీ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా ఉన్నాడు.

అయితే…గ్రూప్ లీగ్, సూపర్ ఫోర్ రౌండ్ మొదటి నాలుగు మ్యాచ్ ల్లో ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించడంతో…. మరోసారి ధోనీ…. జట్టు పగ్గాలు చేపట్టక తప్పలేదు.

వన్డే క్రికెట్ 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో ముగిసిన ఈ పోటీని… ధోనీ నాయకత్వంలోని టీమిండియా… సూపర్ టై గా ముగించడం ద్వారా ఈనెల 28న జరిగే టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

అంతేకాదు…. వన్డే క్రికెట్లో 200 మ్యాచ్ ల్లో భారతజట్టుకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్ గా ధోనీ చరిత్ర సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన…. మూడో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

మూడో క్రికెటర్ ధోనీ….

ధోనీకి ముందే ఈ ఘనత సాధించిన విదేశీ క్రికెటర్లలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు.

రికీ పాంటింగ్ 230 వన్డేల్లో కంగారూ జట్టుకు నాయకత్వం వహిస్తే…స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం 218 వన్డేల్లో కివీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

ధోనీ మాత్రం…మొత్తం 200 వన్డేల్లో 110 గెలుపు, 74 ఓటమి, 1 టై రికార్డుతో ఉన్నాడు.

టీ-20ల్లోనూ టీమిండియాకు 72 మ్యాచ్ ల్లో నాయకత్వం వహించిన ధోనీ… 41 విజయాలు, 28 పరాజయాల రికార్డు సాధించాడు.

అంతేకాదు…భారత క్రికెట్ చరిత్రలోనే…టీ-20 ఫార్మాట్ తో పాటు…వన్డేల్లోనూ టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన ఏకైక ఆటగాడు, ఒకే ఒక్కడు మహేంద్రసింగ్ ధోనీ మాత్రమే.

First Published:  26 Sep 2018 9:30 PM GMT
Next Story