Telugu Global
Cinema & Entertainment

"దేవదాస్" సినిమా రివ్యూ

రివ్యూ: దేవదాస్ రేటింగ్‌: 2.25/5 తారాగణం: నాగార్జున, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్, శరత్ కుమార్, కునాల్ కపూర్ తదితరులు సంగీతం:   మణిశర్మ నిర్మాత:   అశ్విని దత్ దర్శకత్వం:  శ్రీరామ్ ఆదిత్య టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ అపురూపమైన నేపధ్యంలో నాగార్జున, నానిల కాంబోలో వచ్చిన దేవదాస్ మీద ముందు నుంచీ అంచనాలు బాగా ఉన్నాయి. క్రేజీ హీరోయిన్లు, మణిశర్మ లాంటి అగ్ర సంగీత దర్శకుడు, అశ్విని దత్ లాంటి దిగ్గజ నిర్మాత ఇంకేం కావాలనుకున్నారు ప్రేక్షకులు. దానికి తగ్గట్టే పోస్టర్లు, ట్రైలర్లు బాగా […]

దేవదాస్ సినిమా రివ్యూ
X

రివ్యూ: దేవదాస్
రేటింగ్‌: 2.25/5
తారాగణం: నాగార్జున, నాని, రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్, శరత్ కుమార్, కునాల్ కపూర్ తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: అశ్విని దత్
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

టాలీవుడ్ లో మల్టీ స్టారర్స్ అపురూపమైన నేపధ్యంలో నాగార్జున, నానిల కాంబోలో వచ్చిన దేవదాస్ మీద ముందు నుంచీ అంచనాలు బాగా ఉన్నాయి. క్రేజీ హీరోయిన్లు, మణిశర్మ లాంటి అగ్ర సంగీత దర్శకుడు, అశ్విని దత్ లాంటి దిగ్గజ నిర్మాత ఇంకేం కావాలనుకున్నారు ప్రేక్షకులు. దానికి తగ్గట్టే పోస్టర్లు, ట్రైలర్లు బాగా ఊరిస్తూ వచ్చాయి. పైగా క్లాసిక్ దేవదాస్ పేరుతో వచ్చే సాహసం చేసింది కాబట్టి నాగ్ ఎంతో నమ్మకంతో దీనికి ఒప్పుకుని ఉంటాడు అనే అభిప్రాయంతో సామాన్య ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపారు.

దేవా (నాగార్జున) ఒక పెద్ద తోపు డాన్. ఎలా ఉంటాడో తెలియకపోయినా దేశమంతా క్రైమ్ చేసి పెద్ద పేరు సంపాదించుకుంటాడు. తనను పెంచిన దాదా (శరత్ కుమార్)ను హత్య చేసిన డేవిడ్ (కునాల్ కపూర్) కోసం వేట సాగిస్తూ అజ్ఞాతం లో ఉంటాడు. ఓసారి పోలీసులు తన ఉనికిని తెలుసుకుని దాడి చేస్తే బులెట్ గాయంతో దాస్ (నాని) హాస్పిటల్ కు వస్తాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఒకరి ప్రేమ కథలు మరొకరు షేర్ చేసుకుంటారు. దేవాను మంచి మనిషిగా చూడాలని కంకణం కట్టుకుంటాడు దాస్. చివరికి ఏమవుతుందో సగటు ప్రేక్షకుడిగా మీరు ఊహించిందే జరుగుతుంది.

నాగార్జున వయసు ఎప్పుడో ఆగిపోయింది అనేలా యంగ్ గా కనిపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇందులో అనుమానం లేదు. లుక్స్ తో, యాక్టింగ్ తో దేవదాస్ లో కూడా అదే కంటిన్యూ చేసాడు. దాస్ గా పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కానీ నాగ్ కంటే ఎక్కువగా అమాయక డాక్టర్ గా నాని ఇంకా బాగా మెప్పించాడు. పాత్ర వీక్ గా ఉన్నప్పటికీ తన భుజాల మీద మోసి ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేకుండా చూసుకున్నాడు.

హీరోయిన్లు రష్మిక మండన్న, ఆకాంక్ష సింగ్ కథలో భాగమైన పాత్రలే అయినప్పటికీ ఉత్సవ విగ్రహాలే అయ్యారు. ఇంతోటి విలన్ పాత్రకు బాలీవుడ్ నుంచి కునాల్ కపూర్ ని తేవడం వృధా అయ్యింది. మొత్తం కలిపి పావు గంట కూడా కనిపించడు. నరేష్, సత్య, వెన్నెల కిషోర్, రావు రమేష్, మురళి శర్మ…. ఇలా పేరున్న ఆర్టిస్టులను తీసుకున్నారు కానీ ఎవరూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. కారణం అన్నీ రొటీన్ పాత్రలే.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మూడో సినిమాకే బంగారం లాంటి అవకాశం దక్కించుకున్నాడు. కానీ దాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. దేవాను దేశం మొత్తం గడగడలాడే డాన్ గా చూపించి తర్వాత సన్నివేశంలో వీధుల్లో సింపుల్ గా తిరుగుతూ నానితో కలిసి మందు కొడుతూ అల్లరి చేసేలా చూపించడం అసలు సింక్ అవ్వలేదు. మిగిలిన వాళ్ళు దేవా గురించి చాలా సీరియస్ గా ఉంటారు కానీ దేవా మాత్రం సిల్లీగా ప్రవర్తిస్తుంటాడు.

కామెడీని, యాక్షన్ ని ఒకేసారి చూపించి తన దర్శకత్వ ప్రతిభ చూపాలన్న శ్రీరామ్ ఆదిత్య రెండింటికి చెడ్డ రేవడిగా మిగిలాడు. ఫస్ట్ హాఫ్ కొంత మేర పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ లో కథ లేక ఆర్గాన్ డొనేషన్, దేవ దాసుల ప్రేమ కథలు, అపార్థాలు ఇలా చాలా టైం వేస్ట్ చేసాడు. విలన్ గా బిల్డప్ ఇచ్చిన కునాల్ పాత్రను మొక్కుబడిగా మార్చడంతో దేవా పాత్రకున్న వెయిట్ పూర్తిగా జీరో అయిపోయింది.

బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసిన శ్రీరామ్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ అవేవి వీక్ కంటెంట్ ని కాపాడలేకపోయాయి. దేవాకు కథలో అంత హైప్ ఇవ్వకపోయినా బాగుండేది. పైగా అండర్ కవర్ గా రష్మికను, టీవీ న్యూస్ రీడర్ గా ఆకాంక్ష పాత్రలను తీర్చిదిద్దిన తీరులో చాలా లోపాలు ఉండటంతో కనీసం వాళ్ళను చూసి ఎంజాయ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. చాలా ఓపిగ్గా సెకండ్ హాఫ్ ని భరిస్తే తప్ప దేవదాస్ లు కనీసం పాస్ అనిపించుకోలేరు.

మణిశర్మ సంగీతం… ఒక్క పాట, బీజీఎమ్ తప్ప మిగిలిన చోటల్లా తీసికట్టుగా ఉంది. శాందత్ కెమెరా ఒక్కటే కాస్త మెచ్చుకోదగిన క్యాటగిరీలోకి వస్తుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ విమర్శలకు అవకాశం ఇచ్చింది. వైజయంతి బ్యానర్ కు తగ్గట్టే ప్రొడక్షన్ రిచ్ గా ఉంది.

ఫైనల్ గా చెప్పాలంటే నాగార్జున, నానిల కటవుట్ లు చూసి ఏదేదో ఊహించుకుని దేవదాస్ థియేటర్ లోకి అడుగు పెడితే హాఫ్ మీల్స్ పెట్టి దాన్ని కూడా సగంలోనే లాగేసుకుని బయటికి పంపించేస్తారు. చివరిదాకా కుదురుగా కూర్చోవడానికి ఒకే ఒక్క కారణం నాగ్, నాని ల పెర్ఫార్మన్స్ మాత్రమే.

బలహీనమైన కథతో వాళ్ళను అలా రెండు గంటల నలభై నిమిషాల సేపు భరించడం మాకేమి కష్టం కాదనుకుంటే తప్ప దేవదాస్ మెప్పించడం పెద్ద టాస్కే. ఒక యావరేజ్ ఎంటర్ టైనర్ ని స్టార్లతో తీస్తే ఎలా ఉంటుందో చూడాలంటే తప్ప దేవదాస్ లో ఇంకే ప్రత్యేకత లేదు.

దేవదాస్ – బాలన్స్ తప్పిన గ్లాసు

First Published:  27 Sep 2018 10:13 AM GMT
Next Story