నాగార్జున కోపానికి బలైన యంగ్ డైరెక్టర్

అక్కినేని నాగార్జున తెలుగు ఇండస్ట్రీ లో నటుడిగా, నిర్మాతగా ఎన్నో సక్సెస్లని చూసాడు. ఇప్పటికి తన కొడుకుల సినిమాల కథలు వింటూ వాళ్ళ కెరీర్ ని కాపాడుతున్నాడు నాగార్జున. తన ఫ్యామిలీ కి సంభందించిన ఏదైనా హీరో సినిమా బయటకి వెళ్తుంది అంటే ఆ సినిమాకి సంభందించిన అన్నీ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు నాగార్జున. ఇక తన సినిమా విషయానికి వస్తే కథ నుంచి సినిమా ఫస్ట్ కాపీ వరకు జాగ్రత్తగా చూసుకొని అప్పటికి ఏవైనా మార్పులు అవసరం అయితే అప్పుడు డైరెక్టర్ కి మార్పులు చేర్పులు చెప్తాడు నాగార్జున.

కానీ ఇటివలే నాగార్జున నటించిన సినిమాని తనకి తెలియకుండా సినిమా ఫస్ట్ కాపీ ని ఫిక్స్ చేసేసారు మూవీ యూనిట్. సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందు “దేవదాస్” ని చూసిన నాగార్జున సీన్స్ విషయం లో కొన్ని మార్పులు చేయాలి అని భావించాడట, కానీ అప్పటికే మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యి ఉండటంతో ఎవ్వరు ఎం చేయలేకపోయారు.

అయితే ఈ విషయం లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కి ఒక రేంజ్ లో క్లాస్ పీకాడట నాగార్జున. ఇక మీదట ఎప్పుడు ఇలా చెయ్యకు… పెద్దలా మాట సినిమాకి ఎంతో అవసరం అని శ్రీరామ్ ఆదిత్య కి చెప్పాడట నాగార్జున.