Telugu Global
NEWS

పవన్ కల్యాణ్ బజారు మనిషిలా మాట్లాడుతున్నాడు....

పవన్‌ కల్యాణ్ సినిమాల తరహాలోనే రాజకీయాల్లోనూ నటించాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు చింతమనేని. ఒక రాష్ట్ర స్థాయి పార్టీ అధ్యక్షుడు అయిన పవన్‌ కల్యాణ్.. చివరకు ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి స్థాయికి దిగజారిపోయి మాట్లాడారన్నారు. సగటు మనిషికి ఉపయోగపడడంలోనే తన రౌడీయిజం ఉంటుందన్నారు. చింతమనేనిని పవన్ కల్యాణ్ ఒకవైపే చూశారని…. మరో వైపు చూస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. రౌడీయిజం గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. తాను చేస్తున్న అభివృద్ధిపై ఒక్క విమర్శ కూడా చేయలేకపోయారన్నారు. నా వల్ల […]

పవన్ కల్యాణ్  బజారు మనిషిలా  మాట్లాడుతున్నాడు....
X

పవన్‌ కల్యాణ్ సినిమాల తరహాలోనే రాజకీయాల్లోనూ నటించాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు చింతమనేని. ఒక రాష్ట్ర స్థాయి పార్టీ అధ్యక్షుడు అయిన పవన్‌ కల్యాణ్.. చివరకు ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి స్థాయికి దిగజారిపోయి మాట్లాడారన్నారు. సగటు మనిషికి ఉపయోగపడడంలోనే తన రౌడీయిజం ఉంటుందన్నారు.

చింతమనేనిని పవన్ కల్యాణ్ ఒకవైపే చూశారని…. మరో వైపు చూస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. రౌడీయిజం గురించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. తాను చేస్తున్న అభివృద్ధిపై ఒక్క విమర్శ కూడా చేయలేకపోయారన్నారు.

నా వల్ల ఒక కుటుంబం అయినా రోడ్డున పడిందా…. ఒక్క వ్యక్తి అయినా ప్రాణాలు కోల్పోయారా…. ఒక్క మహిళ అయినా నా వల్ల ఇబ్బంది పడిందా అని చింతమనేని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఎమ్మెల్యేలు ఉంటారో, ఎంపీలు ఉంటారో కూడా తెలియకుండా మాట్లాడిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. చిన్న గల్లీలో మీటింగ్‌ పెట్టి పవన్‌ కల్యాణ్ మాట్లాడారని…. తాను తిరిగి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ఆయన మూడు రోజులు అన్నం కూడా తినలేడని చింతమనేని వ్యాఖ్యానించారు.

విప్‌కు, చీఫ్ విప్‌కు తేడా తెలియదా? అని పవన్‌ను ప్రశ్నించారు. తాను విప్‌ను మాత్రమేనని… పవన్ కల్యాణ్‌ మాత్రం చీఫ్ విప్ అంటూ వ్యాఖ్యానించారని విమర్శించారు. హోదా గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు.

పాచిపోయిన లడ్డూల్లో పవన్‌ కల్యాణ్‌కు కూడా వాటా వచ్చిందా? అని ప్రశ్నించారు. 18 ఏళ్ల వ్యక్తిని తనపై పోటీకి పెడుతానని పవన్ కల్యాణ్ చెప్పారని… 18 ఏళ్ల వ్యక్తికి ఓటు మాత్రమే ఉంటుంది గానీ పోటీ చేసేందుకు అర్హత ఉండదన్న విషయం పవన్‌ కల్యాణ్‌కు తెలియకపోవడం శోచనీయమన్నారు.

జగన్‌తోపాటు అనేక మంది నేతలపైనా కేసులున్నాయని… పవన్ కల్యాణ్‌ పులివెందులకు వెళ్లి జగన్‌ను కూడా ఇదే తరహాలో ప్రశ్నించగలరా? అని నిలదీశారు. పవన్‌ కల్యాణ్ ఆడవాళ్ల గురించి నీతులు మాట్లాడుతున్నారని చింతమనేని ఎద్దేవా చేశారు. టీవీ చానల్‌ కొనుక్కొని పవన్‌ కల్యాణ్ ఇష్టానుసారం ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. పవన్ కల్యాణ్ బజారు మనిషిలా మాట్లాడుతున్నారని…. పవన్ చేసిన విమర్శలపై ఎక్కడైనా చర్చకు తాను సిద్దమన్నారు చింతమనేని.

తనపై విమర్శలు చేయడం ద్వారా పవన్ కల్యాణే స్థాయికి దిగజార్చుకున్నారన్నారు. ఎవడో రాసిస్తే దాన్ని చదవడం మానేసి ముందు అవగాహన పెంచుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని…. ఒకవేళ తాను ఓడిపోతే ఆ విజయోత్సవ ర్యాలీలో పవన్ కల్యాణ్‌ వెంట తిరుగుతానన్నారు.

ఒకవేళ పవన్‌ కల్యాణ్ ఓడిపోతే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతే చాలన్నారు. హిట్లర్‌తో చింతమనేనిని పోల్చారంటే పవన్‌ కల్యాణ్ అవగాహన ఏపాటిదో అర్థమైపోతోందన్నారు. పవన్‌ కల్యాణ్ మాటలన్నీ పిట్టలదొరల మాటల్లా ఉన్నాయన్నారు చింతమనేని. రాయలసీమలో మాట్లాడాల్సిన మాటలను పచ్చని పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చి పవన్ మాట్లాడుతున్నారన్నారు. మర్డర్ అంటే ఏంటో తెలియని పశ్చిమగోదావరి జిల్లాలో హింసను పవన్‌ కల్యాణే ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నారని చింతమనేని విమర్శించారు.

First Published:  27 Sep 2018 10:45 AM GMT
Next Story