Telugu Global
National

కూతకు సిద్ధమైన భారతదేశ తొలి లగ్జరీ టూరిస్టు నౌక!

భారతదేశంలో తొలి లగ్జరీ టూరిస్టు నౌక ‘ఆంగ్రియా’ తొలి ప్రయాణానికి సిద్ధమయ్యింది. ముంబై నుంచి గోవాకు ప్రయాణించబోతోంది. ముంబైలోని ఇందిరా డాక్స్‌లో సిద్ధంగా ఉంది. దేశీయంగా ఓ టూరిస్టు నౌక అన్ని లగ్జరీ హంగులతో ప్రయాణించబోవడం ఇదే ప్రధమం. ఈ ప్రయాణానికి అక్టోబర్‌ 12న ముహూర్తం ఖరారు చేశారు. ముంబై నుంచి గోవాకు 16 గంటలపాటు నాన్‌స్టాప్‌ ప్రయాణం సాగించబోతోంది. అక్టోబర్‌ 12న సాయంత్రం 5 గంటలకు ప్రయాణం ప్రారంభమై అక్టోబర్‌ 13 ఉదయం 9 గంటలకు […]

కూతకు సిద్ధమైన భారతదేశ తొలి లగ్జరీ టూరిస్టు నౌక!
X

భారతదేశంలో తొలి లగ్జరీ టూరిస్టు నౌక ‘ఆంగ్రియా’ తొలి ప్రయాణానికి సిద్ధమయ్యింది. ముంబై నుంచి గోవాకు ప్రయాణించబోతోంది. ముంబైలోని ఇందిరా డాక్స్‌లో సిద్ధంగా ఉంది. దేశీయంగా ఓ టూరిస్టు నౌక అన్ని లగ్జరీ హంగులతో ప్రయాణించబోవడం ఇదే ప్రధమం. ఈ ప్రయాణానికి అక్టోబర్‌ 12న ముహూర్తం ఖరారు చేశారు.

ముంబై నుంచి గోవాకు 16 గంటలపాటు నాన్‌స్టాప్‌ ప్రయాణం సాగించబోతోంది. అక్టోబర్‌ 12న సాయంత్రం 5 గంటలకు ప్రయాణం ప్రారంభమై అక్టోబర్‌ 13 ఉదయం 9 గంటలకు ముగుస్తుంది. ఓడ ప్రయాణంలో ఓ సూర్యాస్తమయం, ఓ సూర్యోదయాన్ని ప్రయాణీకులు వీక్షించవచ్చు.

ఈ ఓడ జపాన్‌లో తయారయ్యింది. 9 అంతస్తులున్న ఈ ఓడలో మొత్తం 399 మంది ప్రయాణీకులకు సకల సౌకర్యాలు ఉంటాయి. 8 కేటగిరీలకు చెందిన 104 క్యాబిన్లు ఉన్నాయి. ఆరు బార్లు, రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. సాయంత్రం స్నాక్స్, నైట్‌ డిన్నర్, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ ఉంటాయి.

ముంబై నుంచి గోవాకు టికెట్‌ ధర రూ. 7,000, సూట్‌ రూమ్‌ రూ.11,000. ఇందులో స్నాక్స్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌ కలిసి ఉన్నాయి. త్వరలో ప్రారంభం కానున్న వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

First Published:  28 Sep 2018 12:25 AM GMT
Next Story