Telugu Global
NEWS

దళిత కార్డు.... చంద్రబాబు నుంచి కేసీఆర్ దాకా....

ప్రస్తుత ఎంపీ.. ఇప్పటి చెన్నూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్…. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రాగానే ఆగమేఘాల మీద చెన్నూర్ ప్రచారపర్వానికి కాస్త విరామం ప్రకటించి హైదరాబాద్ వచ్చేశాడు. రాగానే మొత్తం స్క్రిప్ట్, పరిస్థితి వివరించి విలేకరుల సమావేశానికి పంపించారు. బాల్క సుమన్ అంటేనే ఫైర్.. పైగా దళిత నేత.. దీంతో వీరలెవల్లో ప్రసగించేశాడు. రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ కుట్ర అన్న వాళ్లకు ఈ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ దంచికొట్టేశాడు. రేవంత్ […]

దళిత కార్డు.... చంద్రబాబు నుంచి కేసీఆర్ దాకా....
X

ప్రస్తుత ఎంపీ.. ఇప్పటి చెన్నూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్…. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రాగానే ఆగమేఘాల మీద చెన్నూర్ ప్రచారపర్వానికి కాస్త విరామం ప్రకటించి హైదరాబాద్ వచ్చేశాడు. రాగానే మొత్తం స్క్రిప్ట్, పరిస్థితి వివరించి విలేకరుల సమావేశానికి పంపించారు.

బాల్క సుమన్ అంటేనే ఫైర్.. పైగా దళిత నేత.. దీంతో వీరలెవల్లో ప్రసగించేశాడు. రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ కుట్ర అన్న వాళ్లకు ఈ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ దంచికొట్టేశాడు. రేవంత్ చేసిన డబ్బు లావాదేవీలు, అక్రమాలు, విదేశాల్లో మనీ లాండరింగ్ తదితర మొత్తం వ్యవహారాలను మీడియా ముందు కడిగేశాడు. ప్రత్యర్థి కాంగ్రెస్ విమర్శలకు ధీటుగా బదులిచ్చాడు.

బాల్క సుమన్ లాంటి దళిత నేతను తిట్టే సాహసం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ చేయలేకపోతోంది. ఎందుకంటే దళితులను తిట్టావని ఫోకస్ పెడతారు. సానుభూతి పొందుతారు. ఓట్లు రాకుండా చేస్తారు. ఆ సామాజికవర్గంలో విలన్ ను చేస్తారు. అందుకే దళిత నేతలు ఎంత తిట్టినా ఎస్సీ ఎస్టీ కేసులో.. లేక ఆయా సామాజికవర్గానికి భయపడో ఎవ్వరూ నోరు తెరవడం లేదు.

సీఎం కేసీఆర్ ను కూడా దళిత కార్డు ఉపయోగించి అప్పట్లో చంద్రబాబు తీవ్రంగా ఇరుకునపెట్టారు. ఆయన అయితే దళిత సీనియర్ నేత మోత్కుపల్లితో కేసీఆర్ ను టార్గెట్ చేయించి తిట్ల వర్షం కురిపించేలా చేశారు.

మోత్కుపల్లి మోతకు టీఆర్ఎస్ కూడా అప్పట్లో కంగారు పడింది. తిరిగి తిడదామంటే దళిత నేత కావడంతో కేసీఆర్ కూడా ఎప్పుడూ మోత్కుపల్లిపై ప్రతివిమర్శలు చేయలేదు. ఇలా చంద్రబాబు ఏ వర్గం వారిని విమర్శించాలంటే ఆ వర్గం వారిని రంగంలోకి దింపేవాడు. లేదనుకుంటే దళితుల చేత తిట్టించేవాడు.

ఇప్పుడు అదే దళితకార్డును కేసీఆర్ ఉపయోగించారు. రేవంత్ రెడ్డి ఐటీ దాడుల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాడు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీనియర్ నేత జానా సహా అందరూ కేసీఆరే కుట్ర చేశారని తిట్టిపోస్తున్నారు.

ఈ నేపథ్యంలో మకిలి తమకు అంటకుండా టీఆర్ఎస్ అధిష్టానం మంచి వాగ్ధాటి గల బాల్క సుమన్ ను రప్పించి మరీ కాంగ్రెస్ నేతల మాటలకు కౌంటర్లు ఇప్పించారు. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా చేశారు. ఇలా రాజకీయాల్లో దళిత కార్డు ఇప్పుడు ఓ బ్రహ్మాస్త్రంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

First Published:  28 Sep 2018 8:47 AM GMT
Next Story